365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 2, 2025: భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ ఇంటీరియర్, ఫర్నిచర్ బ్రాండ్ ది చార్కోల్ ప్రాజెక్ట్, సుజానే ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తమ రెండో రిటైల్ గ్యాలరీని ఆవిష్కరించింది.

ముంబైలో విజయం సాధించిన తర్వాత, 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులుగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్ నగరంలోని ఇంటీరియర్ డిజైన్ ప్రియులకు కొత్త రుచిని అందించనుంది.

సుజానే ఖాన్ – క్రియేటివ్ విజన్
సుజానే ఖాన్ మాట్లాడుతూ, “14 ఏళ్లుగా డిజైన్ రంగంలో మా ప్రయాణం అద్భుతంగా సాగింది. నా నిజమైన కలను రెండు సంవత్సరాల క్రితం గుర్తించాను – అదేనండీ, విభిన్నమైన ప్రాజెక్ట్‌ను రూపొందించడం.

Read this also...The Charcoal Project Expands to Hyderabad with a Luxurious New Retail Gallery

Read this also...India vs New Zealand: ICC Champions Trophy 2025 Group A Clash – Live Updates & Scorecard

ఇది కూడా చదవండి…ఆరోగ్యరాన్ – 2025: స్వస్థ తెలంగాణ కోసం దూసుకెళ్లిన రన్నర్స్

మా అద్భుతమైన టీమ్‌తో కలిసి ది చార్కోల్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో ప్రారంభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది డిజైన్‌లో ఓ ఉత్సవం – ప్రత్యేక కళాఖండాలు, లిమిటెడ్ ఎడిషన్ ఫర్నిచర్, ఆసక్తికరమైన డెకార్ ఐటమ్స్, ప్రతిభావంతమైన ఆర్టిస్టుల డిజైన్‌లను ఇక్కడ చూడొచ్చు.” అని తెలిపారు.

గౌరీ ఖాన్ డిజైన్స్ ప్రత్యేక ప్రదర్శన
ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యారు. “హైదరాబాద్‌లో గౌరీ ఖాన్ డిజైన్స్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది.

మా బ్రాండ్ ఎప్పుడూ ఫైన్ లగ్జరీ, టైమ్‌లెస్ ఎస్తెటిక్స్, ,బెస్పోక్ క్రాఫ్ట్‌షిప్‌ను ప్రతిబింబిస్తూ వస్తోంది. ఇది క్రియేటివిటీకి, ఇన్నొవేషన్‌కు నిలయంగా నిలుస్తుంది.” అని గౌరీ ఖాన్ అన్నారు.

ఇది కూడా చదవండి…అమెరికాలో అధికారిక భాషగా ఆంగ్లాన్ని ప్రకటించిన ట్రంప్

ఇది కూడా చదవండి…మహాకుంభ్‌లో రైల్వే రద్దీ పెరగడంతో సమస్తిపూర్ డివిజన్‌కు రూ.1.85 కోట్ల ఆదాయం

ఇది కూడా చదవండి…యువతీ Vs యువకులు.. ప్రేమలో కొత్త ధోరణులు..

గౌరీ ఖాన్ డిజైన్స్ శ్రేణిలో ప్రత్యేక ఫర్నిచర్ కలెక్షన్లు, లిమిటెడ్ ఎడిషన్ ఆర్ట్ వర్క్, డెకార్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మృదువైన కాంతులు వెలుగుతున్న మిర్రర్లతో డ్రెస్‌ర్స్, సొగసైన లివింగ్,బెడ్‌రూమ్ సెట్స్, అద్భుతమైన హస్తకళా శిల్పాలు – ఇవన్నీ సమ్మేళనంగా ప్రత్యేక డిజైన్‌ను అందిస్తున్నాయి.

ఎక్స్‌క్లూజివ్ కోలాబరేషన్స్
ఈ స్టోర్‌లో గౌరీ ఖాన్ డిజైన్స్‌తో పాటు, సుజానే ఖాన్ x జనవి కలెక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కలెక్షన్ లగ్జరీ ఇంటీరియర్స్‌కు కొత్త రూపాన్ని ఇస్తూ, కళాత్మకత, సంకేతిక నైపుణ్యం,సాంప్రదాయాన్ని సమ్మేళనం చేస్తుంది.

అదేవిధంగా, ప్రఖ్యాత వాల్‌కవరింగ్ బ్రాండ్ de Gournay సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ‘River Scenes of Bengal’, ‘Amazonia’, ‘Rousseau’, ‘Chichester’ వంటి ప్రత్యేక హ్యాండ్-పెయింటెడ్ డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

తారాగణం హాజరు – ఓ గ్రాండ్ ఈవెంట్
ఈ ప్రత్యేక ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సోనాలి బెంద్రే, భవనా పాండే, నీలం సోని, మాహీప్ కపూర్, కునాల్ కపూర్, కరిష్మా తన్నా, ఫల్గుని పీకాక్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆదార్ పూనావాలా, చిరాగ్ పరిక్ హాజరయ్యారు. వారందరి హాజరుతో ఈ ఈవెంట్ గ్లామర్‌కి నిదర్శనంగా నిలిచింది.

ది చార్కోల్ ప్రాజెక్ట్ – అంతస్తుల వివరాలు
హైదరాబాద్ స్టోర్ మొత్తం ఆరు అంతస్తులు కలిగి ఉంది, ప్రతి అంతస్తు ప్రత్యేక డిజైన్ కాన్సెప్ట్స్‌ను సమర్పిస్తుంది.

ఇది కూడా చదవండి…మహాకుంభ్‌లో రైల్వే రద్దీ పెరగడంతో సమస్తిపూర్ డివిజన్‌కు రూ.1.85 కోట్ల ఆదాయం

ఇది కూడా చదవండి…యువతీ Vs యువకులు.. ప్రేమలో కొత్త ధోరణులు..

🔹 గ్రౌండ్ ఫ్లోర్ – Objects of Affection: ప్రత్యేక గిఫ్టింగ్, హోం డెకార్ ఐటమ్స్.
🔹 ఫస్ట్ ఫ్లోర్ – Terrain Chic: అపార్ట్‌మెంట్ డిజైన్, కిచెన్ కాన్సెప్ట్, ప్రీమియం ఆడియో-విజువల్ అనుభవం.
🔹 సెకండ్ ఫ్లోర్ – The Labyrinth: భిన్నమైన మేటీరియల్స్ మిక్స్‌తో ఇంటీరియర్ ఆర్ట్ గ్యాలరీ.
🔹 మూడో అంతస్తు – గౌరీ ఖాన్ డిజైన్స్: ప్రత్యేక లగ్జరీ ఫర్నిచర్,డెకార్ కలెక్షన్.
🔹 నాలుగో అంతస్తు – The Botanist’s Conservatory: లైబ్రరీ, డ్రాయింగ్ రూమ్, ఆధునిక ఇంటీరియర్ కాన్సెప్ట్.
🔹 ఐదో అంతస్తు – Barn House: క్రియేటివ్ స్టూడియో, కౌన్సెలింగ్ స్పేస్, లిమిటెడ్ ఎడిషన్ ఫర్నిచర్.

ది చార్కోల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఓ రిటైల్ స్టోర్ మాత్రమే కాదు, ఇది భారతదేశ ఇంటీరియర్ డిజైన్ రంగానికి ఓ కొత్త ఒరవడిని తీసుకువస్తోంది. ఇలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ (EMIL) తో కలసి ఈ ప్రాజెక్ట్‌ను సాకారం చేశారు.

త్వరలోనే మరిన్ని ఇన్నొవేటివ్ కలెక్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైన్ ప్రియులు దీన్ని తప్పకుండా సందర్శించాల్సిన లగ్జరీ హబ్ గా అభివృద్ధి చేయడం ది చార్కోల్ ప్రాజెక్ట్ లక్ష్యం.