నూతన సంవత్సరం సందర్భంగా ఖాదీ,గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ఖాదీ ఇండియాకు చెందిన అధికారిక ఈ-కామర్స్ సైట్ eKhadiIndia.com ను ఆవిష్కరించింది. ఈ వెబ్‌సైట్‌లోని వివిధ జాబితాల్లో 50 వేలకు పైగా ఉత్పత్తులు, 500 కంటే ఎక్కువ రకాలు,స్థానికంగా తయారు చేసిన ఖాదీ,విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఎంఎస్‌ఎంలకు అవసరమైన తోడ్పాటును అందించడం ద్వారా ప్రధానమంత్రి లక్ష్యమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధించడంలో ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.పోర్టల్ ప్రయోగాత్మక ప్రారంభం సందర్భంగా ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి ఎ.కె. శర్మ మాట్లాడుతూ,చేనేత,చేతివృత్తులవారు, హస్తకళాకారులు, రైతుల ప్రయోజనం తమకు మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అదే సమయంలో వారు తయారుచేసిన పర్యావరణ స్నేహపూర్వక,ప్రామాణికమైన ఖాదీ & సాంప్రదాయ గ్రామ పరిశ్రమ ఉత్పత్తులు భారతదేశ ప్రజల హృదయానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఉత్పత్తులు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నాయి. కస్టమర్ యొక్క అవసరాలను పోర్టల్ తీర్చగలదు. అలాగే ఉత్పత్తులను వారి ఇంటి వద్దకే అందిస్తుంది. గత కొన్ని నెలలుగా, కోవిడ్స వాళ్లను తట్టుకోవటానికి పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మేము అన్ని పరిమితులను పెంచుతున్నాము. కెవిఐసీ ఈ-కామర్స్ పోర్టల్ ఆ దిశలో మన నిరంతర కృషి ఫలితం అని చెప్పారు.

ప్రారంభోత్స కార్యక్రమం సందర్భంగా కెవిఐసి చైర్మన్ వినాయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ “గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి మరియు స్వయం సంమృద్ధి సాధించడానికి చేపట్టిన ప్రభుత్వ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో మొదటిది ekhadiindia.com అని తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాదీ , విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తుల డిమాండ్లలో స్థిరమైన పెరుగుదల ఉంది. కేవలం 2018-2019 లోనే 25% పెరుగుదలను చూసింది. ఈ చర్య ప్రధానంగా సహజ ఖాదీ ఇండియా ఉత్పత్తులను కొత్త తరం వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించినదని” తెలిపారు.ఈ పోర్టల్‌లో దుస్తులు, కిరాణా, సౌందర్య ఉత్పత్తులు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆరోగ్యం , సంరక్షణ ఉత్పత్తులు, నిత్యావసరాలు,బహుమతులు ఉంటాయి. సహజ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ తీర్చడంతో పాటు ముఖ్యంగా కొత్త తరం వినియోగదారులకు భారతదేశపు బ్రాండ్ ఖాదీని అందించడానికి కెవిఐసి సిద్ధంగా ఉంది. ఆఫ్‌లైన్ షాపింగ్ కంటే ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడే యువతకు ఇది సరైన వేదికగా ఉంటుంది.

ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ekhadiindia.comను వేరుగా ఉంచే ప్రధానాంశాలు: –
* ఖాదీ,గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది.
*ప్రామాణికమైన ఖాదీ ట్రేడ్ మార్క్ ఉత్పత్తులు ఈ పోర్టల్ ద్వారా మాత్రమే లభిస్తాయి.
*ఎస్‌ఎంఈలతో పాటు కళాకారులు / చేనేతలు తమ ఉత్పత్తులను నేరుగా అమ్మకునేందుకు ఈ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. తద్వారా దేశాన్ని డిజిటల్ ఇండియా ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా నడిపిస్తుంది.
* Ekhadiindia.com వెబ్‌సైట్ ఏ ఇతర ఆధునిక ఈ-కామర్స్ పోర్టల్‌ల టెక్నాలజీకి సమానంగా ఉంది.
*బల్క్ ఆర్డర్లు ,డైరెక్ట్ సెల్లర్స్ రిజిస్ట్రేషన్‌లకు కూడా ఈ పోర్టల్‌లో అవకాశం ఉంది.
* కెవిఐసి/కెవిఐబి/పిఎంఈజిపి/ఎస్‌ఎఫ్‌యుఆర్‌టిఐ/వ్యవస్థాపకులు ఏకీకృతం కావడానికి,కెవిఐసీ పరిధిలో కొత్త ఎంఎస్‌ఎంఈలు /పిఎంఈజిపి యూనిట్లకు మద్దతు ఇవ్వడానికి ఒక భారీ వేదిక. ఇక్కడ సంస్థలు/ యూనిట్లు వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను అమ్మవచ్చు / రవాణా చేయవచ్చు.
* కస్టమర్ కేర్ సౌకర్యం; నగదు వాపసు విధానం.
* ఒకే సమయంలో 50,000 మందికి పైగా వినియోగదారులు పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.
* సోషల్ మీడియా అనుకూలం.
* వెబ్‌సైట్,మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
* డిజిటల్ చెల్లింపులకు అనుకూలమైన వ్యవస్థ.
* దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 2400 నగరాలు/పట్టణాలల్లో 120 కోట్లకు పైగా జనాభాకు అనుసంధానంగా ఉంటుంది
* వివిధ రకాల వినియోగదారులకు అవసరమైన 1500పైగా ఉత్పత్తుల విస్తృత శ్రేణితో ప్రారంభించబడింది.
దేశంలో పెద్దమొత్తంలో ఉపాధి అందిస్తున్న వారిలో కేవిఐసీ ఒకటి. అలాగే ఇది ప్రధానమంత్రి పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా మేరకు వివిధ ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తోంది. ఖాదీ,గ్రామ పరిశ్రమలతో చేనేత కార్మికులు, చేతివృత్తులవారు, హస్తకళాకారులు, రైతులు భారతదేశ సూక్ష్మ / చిన్న పారిశ్రామికవేత్తలు కొత్త తరం డిజిటల్ మార్కెట్ దిశగా అభివృద్ధి చెందాలని కెవిఐసి సంకల్పించింది.