365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 27,2023: మహానటుడు సామర్లకోట వెంకట రంగారావు (ఎస్వీఆర్) ఆకస్మిక మరణం తరువాత ఆయనతో కలిసి పనిచేసిన సినిమా నిర్మాతలందరూ ఎస్వీఆర్ తమ సినిమాలలో నటించిన సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, పద్యాలూ కలిపి ఒక డాక్యూమెంటరీ సినిమాగా తీసి విడుదల చేయాలనుకున్నారు.
అంతేకాదు ఆ సినిమా హక్కులు ఎస్వీఆర్ గారి కుటుంబ సబ్యులకు ఆర్థిక సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఫలితంగా “విశ్వ నట చక్రవర్తి” పేరుతో సినిమా నిర్మాణం జరిగింది.
ఎస్వీఆర్ గారి ధర్మపత్ని లీలావతి గారు నిర్మాతగా వ్యవహరించారు. ఎస్వీఆర్ గారి మేనల్లుడు బడేటి ఉదయకుమార్ సమర్పించిన ఈ సినిమాకు కట్టా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేయగా, కే.శ్యామ్ రాజ్ సంగీతం అందించారు.
ఎస్.వీ.అర్.ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం 1994లో అక్టోబర్14తేదీన విడుదలయ్యి ఘాన విజయం సాధించింది.
ప్రేక్షకులు ఆదరించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తరువాత ఆ సినిమా మళ్లీ విడుదల చెయ్యలేదు. అంతేకాదు టివిలలో ప్రసారం చెయ్యలేదు.
ఆ సినిమా హక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో తెలియదు. ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు శ్రమ తీసుకొని ఆ సినిమాను ఓటిటిలో ప్రసారం చెయ్యగలిగితే, ఈ తరం యువకులకు ఆ మహానటుడి నటనా వైభవం చూసే అదృష్టం కలుగుతుంది.