365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 22,2023:వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ఆగస్టు నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో 25 నుంచి 30 మంది పేర్లను విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది.
బీజేపీ పార్టీ అధిష్టానం ఇప్పటికే 60 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. వారిలో 30 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించనున్నారు.
ఆగస్టు 27న ఖమ్మంలో జరగనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ తర్వాత ఏ రోజైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ అధిష్టానం 60 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. వారిలో 30 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించనున్నారు.
అధికార బీఆర్‌ఎస్ 115 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను సోమవారం విడుదల చేసిన నేపథ్యంలో తొలి జాబితాను ప్రకటించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. మొత్తంగా మూడు దశల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది.