365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2025: మధుర వీధుల్లో ఆ అడుగులు ఆగలేదు.. గత జన్మ వాసనలు ఆమెను వదల్లేదు. అప్పుడెప్పుడో ముగిసిపోయిందనుకున్న ‘లుగ్దీ దేవి’ ప్రయాణం, ‘శాంతి దేవి’ రూపంలో మళ్ళీ మొదలైంది. ఇది ఒక అంతుచిక్కని రహస్యం.. మహాత్మా గాంధీనే ఆశ్చర్యపరిచిన అరుదైన పునర్జన్మ ఉదంతం!
జ్ఞాపకాల గూడు.. సాధారణంగా నాలుగేళ్ల వయసులో పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. కానీ 1920వ దశకంలో ఢిల్లీకి చెందిన చిరుత ప్రాయపు శాంతి దేవి మాత్రం మధుర గురించి కలవరించడం మొదలుపెట్టింది.
“ఇది నా ఇల్లు కాదు.. నా ఇల్లు మధురలో ఉంది” అంటూ ఆమె చెబుతుంటే తల్లిదండ్రులు మొదట అది బాల్య చేష్టలే అనుకున్నారు. కానీ, ఆమె తన పేరు ‘లుగ్దీ దేవి’ అని, తన భర్త పేరు కేదార్‌నాథ్ అని ఖచ్చితంగా చెప్పడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

నిరూపితమైన నిజం.. శాంతి దేవి మాటల్లోని నిజానిజాలను తేల్చడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధురలోని కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు. ఆశ్చర్యకరంగా, 1925లో ప్రసవించిన పది రోజులకే కేదార్‌నాథ్ భార్య లుగ్దీ దేవి మరణించిందని తేలింది. శాంతి దేవి చెబుతున్న ప్రతి విషయం అక్షర సత్యమని అర్థమైనప్పుడు అందరి గుండెలు ఒక్కసారిగా ఆగాయి.
గాంధీజీ దృష్టిలో.. ఈ వార్త దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. శాంతి దేవి కథనం అబద్ధమని కొందరు, అద్భుతమని మరికొందరు వాదించారు. చివరకు మహాత్మా గాంధీ స్వయంగా ఈ కేసును విచారించాలని నిర్ణయించుకున్నారు. ఆయన నియమించిన 15 మంది సభ్యుల కమిటీ శాంతి దేవిని మధురకు తీసుకెళ్లింది.
Read this also:Defence Tech Major Tonbo Imaging Files for IPO; SEBI Receives DRHP for Share Sale..
ఇది కూడా చదవండి : 2026 మొత్తం ‘దండోరా’ గురించే చర్చించుకుంటారు: సక్సెస్ మీట్‌లో నటుడు శివాజీ ధీమా..
Read this also:“Dhandoraa” Success Meet: Sivaji Hails it as a Masterpiece; Comparisons to Mari Selvaraj Arise.
Read this also: Bondada Engineering Secures Rs.392 Crore Solar EPC Contract from NTPC Green Energy..
పూర్వ జన్మ భర్తను, మామగారిని గుర్తుపట్టింది..
అక్కడ అడుగుపెట్టిన ఆ చిన్నారి.. ఎవరూ చెప్పకుండానే రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి వెళ్లే దారిని చూపించింది. గుంపులో ఉన్న తన పూర్వ జన్మ భర్తను, మామగారిని గుర్తుపట్టింది.
తాను దాచిన సొమ్ము ఎక్కడుందో చెప్పింది..

మధుర యాసలో మాట్లాడుతూ.. తాను దాచిన సొమ్ము ఎక్కడుందో కూడా కళ్లకు కట్టినట్లు వివరించింది.విజ్ఞానశాస్త్రానికి సవాల్.. 1936లో వెలువడిన అధికారిక నివేదిక ఈ ప్రపంచానికి ఒక కొత్త సత్యాన్ని పరిచయం చేసింది. శాంతి దేవి మరెవరో కాదు, మరణించిన లుగ్దీ దేవికి పునర్జన్మ అని కమిషన్ నిర్ధారించింది. ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకులు కూడా ఆమెను పరీక్షించి ఆశ్చర్యపోయారు.
శాంతి దేవి తన శేష జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా, దైవచింతనలోనే గడిపారు. 1987 డిసెంబర్ 27న ఆమె కన్నుమూసే వరకు, మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందనే నమ్మకానికి ఆమె ఒక సజీవ సాక్ష్యంగా నిలిచారు. విజ్ఞానశాస్త్రం ఎంత ఎదిగినా, కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు మట్టిలోనే ఉంటాయని ఈ కేసు మరోసారి గుర్తుచేస్తుంది.
