-ముగ్గురు నృత్య, సంగీత విద్యాంసుల ఆధ్వర్యంలో కార్యక్రమం..
-కూచిపూడి నాట్యం, కర్ణాటిక్ సంగీత సమ్మేళనంతో శ్రీ కృష్ణ కథ
-లోటస్ పాండ్ రావి నారాయణరెడ్డి మెమోరియల్ ఆడిటోరియం వేదికగా ప్రదర్శన
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 9 ఫిబ్రవరి, 2024: త్రిసంగంమంలాంటి ప్రఖ్యాత కర్ణాటిక్ సంగీత విద్వాంసురాలు (గాయని), కూచిపూడి నృత్యంలో తన ప్రస్థానాన్ని పదిలం చేసుకుంటున్న వర్ధమాన నృత్యకారిణి అవని రెడ్డి విశావరం, సీనియర్ కూచిపూడి నృత్యకారిణి-నాట్య గురువు ‘అభా నక్టోడ్’ల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కథను నాట్య, సంగీత సమ్మోహన ప్రదర్శనకు నగరంలోని లోటస్ పాండ్ రావి నారాయణరెడ్డి మెమోరియల్ ఆడిటోరియం వేదికగా మారింది.
ఈ అద్భుత కళాకారుల నయనానందమైన ప్రదర్శన శనివారం సాయంత్రం 7 నుంచి 08:30 గంటల వరకు కొనసాగనుంది. శ్రీకృష్ణుని మనోహరమైన కథకు ఈ విద్వాంసుల కళతో ఆత్మను నింపనుంది. సంగీత స్వరాలు, నాట్య పదనిసలతో అనిర్వచనీయమైన అద్బుత కళా వేదికను ఆస్వాదించడానికి టిక్కెట్లను బుక్ మై షో https://in.bookmyshow.com/events/kris…, PayTM https://insider.in/krishnas-ensemble-… లింక్‌లలో పొందవచ్చు.