
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 30,2021: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు.

ఆగస్టు 31న ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4నుంచి 5 గంటల వరకు శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.