365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా న‌వంబ‌రు 6వ తేదీ నుంచి నెల రోజుల పాటు జ‌రిగిన హోమ మహోత్సవాలు శ‌నివారం ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, ఏకాంతంగా త్రిశూల‌స్నానం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, ఏకాంతంగా త్రిశూల‌స్నానం, అంకుర విసర్జన నిర్వహించారు.

సాయంత్రం పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు.