365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 15,2024: కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లా మాగడిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల దివ్య, తన భర్త ఉమేశ్ చేతిలో అమానుషంగా ప్రాణాలు కోల్పోయింది. కారణం? ఆమె అందంగా తయారవుతుందన్న చిన్న విషయమే.
దివ్య, లిప్స్టిక్ వేసుకొని, టాటూ వేయించుకుని అందంగా కనిపించడం అంటే భర్తకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ చిన్న విషయమే వారికి మధ్య గొడవలకు దారితీసింది. పెళ్లి తర్వాత వచ్చిన విభేదాలు తీవ్రమవ్వడంతో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
కోర్టు విచారణ అనంతరం, ఉమేశ్ తన భార్యపై అనుమానం విడిచి పెట్టినట్లు నమ్మబలికాడు. ఆపై, దివ్యను గుడికి తీసుకెళ్లి, తన స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు. చిన్న విషయాలపై సంయమనం కోల్పోవడం ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.