-365తెలుగు డాట్ కామ్ ప్రత్యేక ప్రతినిధి
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, ఏప్రిల్ 22, 2025 : తెలంగాణ రాష్ట్రంలో దళారుల దోపిడీ యథావిధిగా కొనసాగుతోంది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా వారు తమ పంథా మార్చకుండా రైతులను నిలువునా ముంచుతున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం క్వింటాల్ బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2,222 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం సిండికేట్‌గా మారి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రస్తుతం 77 కేజీల ధాన్యం బస్తాను కేవలం రూ. 1230కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇది కూడా చదవండి…ఆది శ్రీనివాస్ 15 ఏళ్ల న్యాయపోరాటంలో సంచలన విజయం: చెన్నమనేని రమేష్‌పై రూ.30 లక్షల జరిమానా..
ఇది కూడా చదవండి...ఢిల్లీకి గ్రీన్ ట్రాన్సిట్ బూస్ట్: ఏప్రిల్ 22న కొత్త 320 AC ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
Read this also…Pune Gas Unveils Telangana’s First ‘Pune Gas Experience Centre’ in Hyderabad
ఒకవైపు అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు రైతుల గుండెల్లో గుబులు రేపుతుంటే, మరోవైపు దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దళారుల ఆగడాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది.