365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగష్టు 14,2023: విషం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది సైనైడ్ అయితే అంతకన్నా ప్రమాదకరమైన విషం మన భూమిపై ఉందని మీకు తెలుసా..? అందులో ఒక గ్రాము తాగితే చాలు వేలాది మంది చనిపోతారు.
ఇంతకీ అదేంటంటే..? పోలోనియం (Polonium-210) దీని రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మానవ శరీరంలోని అంతర్గత అవయవాలు, DNA రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. దీని కారణంగా క్షణంలో చనిపోతారు.
పోలోనియం నిజానికి యురేనియం ధాతువులో లభించే లోహం. ఇది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించదు ఎందుకంటే ఈ ఆల్ఫా కణాలు మన నుంచి చాలా దూరం ప్రయాణించలేవు, కానీ పొరపాటున అది మన శరీరంలోకి చేరితే ప్రపంచంలోని ఏ వైద్యుడు నిరోధించలేడు.
ఇది మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, మన వెంట్రుకలన్నీ ఆటోమేటిక్‌గా రాలడం ప్రారంభిస్తాయి. క్రమంగా అది మన శరీరంలోకి ప్రవేశించి ప్రతిదీ నాశనం చేస్తుంది.
పోలోనియం-210ని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో కనుగొన్నారు. దీనిని కనుగొన్నందుకు ఆమెకు నోబెల్ బహుమతి లభించింది.
పొలోనియంకు ఇంతకుముందు రేడియం ఎఫ్ అని పేరు పెట్టినప్పటికీ, తర్వాత దానిని మార్చారు. శాస్త్రవేత్తల ప్రకారం, పొలోనియం-210 ఉప్పు సైజులో ఉన్న చిన్న కణాలు మానవ శరీరంలోకి వెళ్లినా క్షణంలో చనిపోతారు.
పోలోనియం-210ని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఆహారంతో కలిపితే, దాని రుచిని గుర్తించలేము.
పొలోనియం విషం మొదటి బాధితురాలు ఐరీన్ జూలియట్ క్యూరీ. ఆమె ఎవరోకాదు పొలోనియం గుర్తించిన మేరీ క్యూరీ కుమార్తె.ఆమె ఒక చిన్న కణాన్ని తీసుకోవడంతో ఆమె మరుసటిక్షణంలోనే మృతి చెందింది.
అంతే కాకుండా ఇజ్రాయెల్ కు అతి పెద్ద శత్రువుగా భావించే పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్ మరణానికి కూడా ఈ విషమే కారణమని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశోధించడానికి, యాసర్ అరాఫత్ మృతదేహాన్ని ఖననం చేసిన చాలా సంవత్సరాల తర్వాత వెలికితీశారు.
ఈ రీసెర్చ్ ద్వారా అతని శరీరంలో రేడియోధార్మిక పొలోనియం-210 గుర్తించినట్లు స్విట్జర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.