365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 27,2023:ఒక సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో, 68శాతం జంటలు వివాహం చేసుకున్నారు. అయితే 2023 లో 44శాతం కొత్త జంటలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అంటే మూడేళ్లలో కుదిరిన వివాహాల లెక్కల్లో 24 శాతం తగ్గుదల నమోదైంది.
భారతదేశంలో వివాహ బంధాన్ని జన్మ బంధంగా పరిగణిస్తారు. పెళ్లయ్యాక అబ్బాయి, అమ్మాయి మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా బంధుత్వంతో పెనవేసుకుపోతుంటాయి. పూర్వ కాలంలో కుటుంబ సభ్యులు పెళ్లి కోసం జీవిత భాగస్వామి కోసం వెతికేవారు. దీన్నే అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు.
ఈ పద్దతిలో అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబం జీవిత భాగస్వామిని ఎంచుకుంటుంది. ఇలా కుదిరిన వివాహంలో చాలామంది వధూవరులకు ఒకరికొకరు ముందుగా తెలియదు, పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లితో ఇద్దరు అపరిచితులు ఒక్కటి అవుతారు. అదే సమయంలో గత కొన్నేళ్లుగా ప్రేమ వివాహాల ట్రెండ్ పెరిగింది.

ప్రేమ వివాహం అంటే లవ్ మ్యారేజ్. ఈ రకమైన వివాహంలో, అబ్బాయి లేదా అమ్మాయి తమ జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో ఒకరినొకరు బాగా తెలుసుకుని పెళ్లి చేసుకుంటారు. పెద్దలు కుదిర్చిన వివాహం లేదా ప్రేమ వివాహం రెండు పద్దతుల ద్వారా వధూవరులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు రకాల వివాహ పద్ధతులపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. అందులో గత కొన్నేళ్లలో కుదిరిన వివాహాలు 24శాతం తగ్గిందని తేలింది.
వివాహ పోకడలపై సర్వే..
పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ వైర్ ఇండియా ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, 2020 సంవత్సరంలో, 68శాతం జంటలు వివాహం చేసుకున్నారు. అయితే 2023 సంవత్సరంలో కొత్త జంటలలో 44శాతం మాత్రమే వివాహం చేసుకున్నారు.
అంటే మూడేళ్లలో కుదిరిన వివాహాల లెక్కల్లో 24 శాతం తగ్గుదల నమోదైంది. వెడ్డింగ్ వైర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అనమ్ జుబేర్ మాట్లాడుతూ దేశంలోని పట్టణ మధ్యతరగతి ప్రజలు ప్రేమ వివాహాలను ఎక్కువగా అంగీకరిస్తున్నారని చెప్పారు.
పెరిగిన ప్రేమ వివాహాలు..
దేశంలోని జంటలలో 41 శాతం మంది అలాంటి వారేనని, వారు తమ వివాహాన్ని 4-6 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటారని సర్వే నివేదిక పేర్కొంది. 1నుంచి 3 నెలల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే జంటలు 32 శాతం ఉండగా.. నిశ్చితార్థం, వివాహానికి మధ్య సమయం విదేశాలలో నిశ్చితార్థం సమయం చాలా సంవత్సరాలు ఉంటుంది, కానీ భారతదేశంలో 72శాతం కేసులలో నిశ్చితార్థం సమయం 6 నెలల కన్నా తక్కువగా ఉంది.

వివాహం కోసం ఆన్‌లైన్ లో సెర్చ్..
వివాహాన్ని నిర్వహించే సంస్థలు ట్రెండ్‌కు అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయి. అటువంటి పరిస్థితిలో, వివాహానికి ప్లాన్ చేసుకునే జంటలు నేటి తరంలో ఆన్‌లైన్ వనరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వెడ్డింగ్ బడ్జెట్ నుంచి ఆన్‌లైన్‌లో వెండర్‌లను వెతకడం వరకు అన్ని రకాల పనులకోసం ఆన్ లైన్ సేవలపైనే ఆధార పడుతున్నారు. సర్వే నివేదిక ప్రకారం, వివాహాల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వారి సంఖ్య 11శాతం పెరిగింది.