365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 20 ఏప్రిల్ 2022 : సామాజిక బాధ్యత కలిగిన పౌరులను అభివృద్ధి చేసేందుకు సమీకృత బోధనా విధానంతో కూడిన దూరదృష్టి కలిగిన కె –12 పాఠశాల ప్రీమియా అకాడమీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్ ఫీడ్ స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డును ‘టాప్ 500 స్కూల్స్ ఆఫ్ ఇండియా’విభాగంలో అందుకోవడం ద్వారా మరో మైలురాయిని చేరుకుంది. నగరంలోని ఇతర పాఠశాలల నడుమ విభిన్నంగా ప్రీమియా అకాడమీని ఈ అవార్డు నిలుపుతుంది. ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలను ఆవిష్కరిస్తూనే ఆ కరిక్యులమ్‌ను ప్రత్యేకమైనదిగా మార్చడానికి నిరంతర ప్రయత్నాలను చేస్తుంది. విద్యార్ధులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయా లు,పాఠ్యేతర కార్యకలాపాల సౌకర్యాలతో పాటుగా అత్యుత్తమ జాతీయ,అంతర్జాతీయ పాఠ్యాంశాలను తీసుకురావాలనే ప్రీమియా అకాడమీ ప్రయత్నాలను ఈ అవార్డు ప్రశంసిస్తోంది.
భారతదేశపు ప్రతిష్టాత్మకమైన విద్య అవార్డు కోసం ప్రీమియా అకాడమీ ఎంపికైంది. కోవిడ్ 19 మహమ్మారి కాలంలో ప్రైమరీ, సెకండరీ విద్యారంగాన్ని సమూలంగా మార్చడానికి అపారమైన ప్రయత్నాలను చేసింది. ఈ స్కూల్ నునిష్ణాతులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం విద్యాపరంగా ఖ్యాతి, ఉపాధ్యాయుల నైపుణ్యం,శ్రేయస్సు,
కో–కరిక్యులకర్ విద్య, క్రీడా విద్య , డిజిటల్ అభ్యాస పురోగతి, విద్యార్ధుల పురోగతి, మెంటారింగ్, నాణ్యత నిర్వహణలో నాయకత్వం, తల్లిదండ్రులతో అనుసంధానత, భవిష్యత్‌కు అనువుగా అభ్యాస వసతులు, నగదుకు తగ్గ విలువ,కమ్యూనిటీ సేవ, కెరీర్ కౌన్సిలింగ్,అడ్వాన్స్‌మెంట్, విద్యార్ధుల మానసిక సంక్షేమం, విద్యార్థుల కోసం వ్యక్తిగత శ్రద్ధ వంటి అనేక అంశాల ఆధారంగా ఎంపిక చేశారు.
గతంలో, ప్రీమియా అకాడమీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఎన్నో లభించా యి. వీటిలో బెస్ట్ ఎమర్జింగ్ సీబీఎస్‌ఈ స్కూల్, ఇండియా స్కూల్ మెరిట్ అవార్డు
మరియు ఇస్మా చేత ఎక్స్‌లెన్స్ ఇన్ హైబ్రిడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ టుడే ,ఎల్ర్డాక్ ఇండియా వంటివి ఉన్నాయి.ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి తృప్తి రావు మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో టాప్ 500 స్కూల్స్ అవార్డు అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. బ్రెయిన్‌ఫీడ్ నుంచి ఈ అవార్డు అందుకోవడాన్ని ఓ గౌరవంగా
భావిస్తున్నాము,మా ప్రయత్నాలు, కార్యకలాపాలను గుర్తించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ తరహా గుర్తింపులు మాకు పూర్తి ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటుగా కె 12 విభాగంలో అతి పెద్ద లక్ష్యం చేరుకునేందుకు స్ఫూర్తినందిస్తాయి.
మేమెప్పుడూ కూడా అత్యుత్తమ విద్యామౌలిక వసతులు, అభ్యాస కార్యక్రమాలను అందించడానికి ప్రయత్నిస్తుంటాము. ఈ తరహా గుర్తింపులు పాఠ్యాంశాల ద్వారా నిర్వచించబడిన జ్ఞానాన్ని సమీకరించడంలో సహాయపడటానికి మా ప్రయత్నాన్ని కొనసాగించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సమాజం పట్ల బాధ్యతాయు తమైన దృక్పధాన్ని ఏర్పరుస్తుంది’’ అని అన్నారు. ప్రీమియా అకాడమీ ఫౌండర్ –మేనేజింగ్ డైరెక్టర్ సింధూరి రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రీమియా అకాడమీ వద్ద, మేము
ఆవిష్కరణలు, డిజైన్ ఆలోచనలు ప్రోత్సహించడంతో పాటుగా మా విద్యార్థులు తమ ప్రతిభను అన్వేషించుకుని ఆ దిశగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకోవడానికి, తద్వారా వ్యవస్ధాపక ఆలోచనలు మెరుగుపరుచుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం.
విద్యార్థిని సంపూర్ణంగా తీర్చిదిద్దేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విధానం,అనుభవపూర్వక అభ్యాసంతో మా విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సహాయపడే విద్యా కార్యక్రమాలు తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తూనే, పలు కార్యక్రమాల ద్వారా వాస్తవ ప్రపంచంలో విద్యార్థులు
తాము అభ్యసించిన అంశాలను ఉపయోగించుకునేందుకు తోడ్పడుతున్నాం’’ అని అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్ వద్ద జరిగిన వేడుకలో ఈ అవార్డు ను ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్ తృప్తిరావు అందుకున్నారు.