Tue. Dec 24th, 2024
PM greets people on Parkash Purab of Guru Nanak

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ నవంబర్ ,28,2020:కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి ,తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు  సందర్శించారు.ఈ మేరకు నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  “హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ వద్ద, వారి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి వివరించారు.ఇప్పటివరకు పరీక్షల్లోపురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు. వారి బృందం వేగవంతమైన  పురోగతిని సాధించేందుకు ఐ.సి.ఎం.ఆర్. తో కలిసి పనిచేస్తోంది.” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈ ఉదయం, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించారు.

error: Content is protected !!