365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబరు 25,2021:జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డి) టోకెన్లను డిసెంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.