365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వారణాసి,నవంబర్ 28,2022: పవర్లూమ్ సెంటర్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ దొంగ డోర్లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. వారణాసిలోని సారనాథ్ ప్రాంతంలోని డానియాల్పూర్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాం అనే వ్యక్తికి చెందిన పవర్ లూమ్ సెంటర్ గత రెండు రోజులుగా మూతపడింది.
మృతుని గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో ఉన్న జావేద్ (30)గా గుర్తించారు. పవర్ లూమ్ సెంటర్ తలుపులకు తాళం వేసి ఉందని తెలియక జావేద్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఒక్కసారిగా లోపలికివెళ్ళొచ్చాని భావించి అతను రెండు డోర్ బీమ్ల మధ్య ఇరుక్కుపోయాడు.

అతని తల విచిత్రంగా పవర్ లూమ్ డోర్ లోపల ఇరుక్కుపోయి ఉంది, అతని శరీరం మిగిలిన భాగం బయట ఉంది. చాలాసేపు అతను బయటకురావాలని ప్రయత్నించి ,చివరికి ప్రాణాలు వదిలాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం