365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 23,2022:నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన ఓ మహిళ తన కారును లాక్కెళ్లిన ట్రాఫిక్ పోలీసుల వాకీటాకీని లాక్కెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కోటిలో చోటుచేసుకుంది. అసలు సమాచారం ప్రకారం కోటిలో రద్దీగా ఉండే రహదారిలో నో పార్కింగ్ ప్రాంతంలో ఒక మహిళ తన కారును పార్క్ చేసి ఎక్కడికో వెళ్లిపోయింది.

రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆమె కారును లాక్ చేశారు. ఆ తర్వాత తిరిగి కారు వద్దకు వచ్చిన మహిళ తన కారు తాళం వేసి ఉండటాన్ని గుర్తించి హంగామా చేసింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్ చెల్లించాలని కోరడంతో ఆమె పోలీసుల వాకీటాకీని లాక్కుంది. పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.
