365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఫిబ్రవరి 23, 2025: గ్రోక్ 3 విడుదలను ఎలోన్ మస్క్ నేతృత్వం లోని xAI కంపెనీ అధికారికంగా ప్రకటించింది. OpenAI ChatGPT, Google Gemini లకు పోటీగా రాబోతున్న ఈ అత్యాధునిక AI మోడల్‌ను మస్క్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన చాట్‌బాట్‌గా పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రాథమికంగా X (ట్విటర్) ప్రీమియం ప్లస్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే దీన్ని సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

గ్రోక్ 3 విశేషాలు..

🚀 అత్యాధునిక మోడల్ – OpenAI, Google మోడళ్లకు గట్టి పోటీ
💡 చెట్టింగ్‌లో అత్యుత్తమ పనితీరు – మునుపటి వెర్షన్ల కంటే వేగంగా, సమర్థంగా స్పందించేలా రూపొందింపు
🔗 X ప్రీమియం ప్లస్ సభ్యత్వంతో అందుబాటులో
📌 సూపర్ గ్రోక్ మెంబర్‌షిప్ ప్లాన్ – అత్యాధునిక ఫీచర్ల కోసం కొత్త ప్లాన్

గ్రోక్ 3 ఎలా ఉపయోగించాలి..?

ప్రస్తుతం, Grok 3 వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. కానీ, Grok 2 ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి:
✅ X యాప్‌ లోకి వెళ్లి సెర్చ్ ఐకాన్ పక్కన ఉన్న Grok Xi పై క్లిక్ చేయాలి
✅ లేదా బ్రౌజర్ ద్వారా Grok.com వెబ్‌సైట్‌ లో లాగిన్ కావచ్చు
✅ వినియోగదారులు X ప్రీమియం ప్లస్‌ కు సభ్యత్వం తీసుకుంటే, గ్రోక్ 3 యాక్సెస్ పొందే అవకాశముంది.

ఇది కూడా చదవండి.చక్కెర టీ కంటే బెల్లం టీ ఆరోగ్యకర మైనదా..? తయారీ విధానం ఎలా..?

ఇది కూడా చదవండి.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ రెండో ఎడిషన్ విడుదల..

ఇది కూడా చదవండి.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్..

ఎలోన్ మస్క్ ఏమంటున్నారు?

గ్రోక్ 3 మునుపటి వెర్షన్ Grok 2 కన్నా శక్తివంతమైనది అని మస్క్ తెలిపారు. ఇది భారీ ప్రాసెసింగ్ సామర్థ్యంతో క్లిష్టమైన పనులను సులభంగా నిర్వహించగలదు. AI మార్కెట్లో ఈ మోడల్ ప్రముఖ పోటీదారులకంటే మెరుగైనదిగా నిలుస్తుందని xAI పరిశోధకులు చెబుతున్నారు.

xAI డేటా సెంటర్ – రికార్డు సమయంలో నిర్మాణం
Grok 3 ప్రారంభానికి అనుకూలంగా xAI కేవలం 4 నెలల్లోనే భారీ డేటా సెంటర్‌ను నిర్మించింది. 100,000 GPUలతో కూడిన క్లస్టర్‌ను 122 రోజుల్లో అమలు చేయడం xAI కంపెనీకి పెద్ద విజయమని మస్క్ తెలిపారు. ప్రస్తుతం ఈ H100 క్లస్టర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకొని, 92 రోజుల్లోనే పూర్తిచేశారు. ఈ అత్యాధునిక కంప్యూటింగ్ శక్తిని ఉపయోగించి, Grok 3 ను నిరంతరం మెరుగుపరిచే పనిలో ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.

గ్రోక్ 3 – AI రంగంలో మస్క్ విప్లవాత్మక అడుగు
xAI నుంచి వస్తున్న Grok 3 ప్రయోగం, ఎలోన్ మస్క్‌ తీసుకున్న గణనీయమైన నిర్ణయాల్లో ఒకటి. భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్‌లు ఈ మోడల్‌లోకి వస్తాయని, ఇది AI రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. Grok.com