Mon. Jul 8th, 2024
MinisterNitin-gadgari

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి14,2023: దేశంలో జనాభా కంటే వాహనాలే ఎక్కువగా ఉన్నాయని, ఏటా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

రెండు కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు..

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 20.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని, 2021తో పోలిస్తే, 1 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 300 శాతం పెరుగుదల ఉంది. 2030 నాటికి నా అంచనా ప్రకారం రెండు కోట్ల వాహనాలు ఉంటాయి.

యూపీలోనే ఎక్కువ సంఖ్యలో ఈవీలు..

MinisterNitin-gadgari

ఉత్తరప్రదేశ్‌లో గరిష్టంగా 4.5 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రాబోయే కాలంలో వాటి సంఖ్య కూడా పెరుగు తుందని, దీనివల్ల 10 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు.

ఐదేళ్లలో రెట్టింపు లక్ష్యం..

ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.7.8 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమ నాలుగు కోట్ల ఉద్యోగాలు కల్పించింది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి మాత్రమే గరిష్టజీఎస్టీ ని పొందుతాయి. ఈ రూ.7.8 లక్షల కోట్ల పరిశ్రమను ఐదేళ్లలో రూ.15 లక్షల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

జనాభా కంటే వాహనాలు ఎక్కువగా ఉంటాయి..

ప్రస్తుతం దేశంలో 30 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయని గడ్కరీ తెలిపారు. 10 సంవత్సరాల తరువాత జనాభా తక్కువగా, వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రతి ఇంట్లో ముగ్గురు వ్యక్తులు, ఐదు వాహనాలు ఉంటాయని, ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో ఇదే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతర వృద్ధి చెందుతోందని చెప్పారు.

MinisterNitin-gadgari

10, 15 ఏళ్ల నాటి 10 లక్షల వాహనాలను భారత ప్రభుత్వం రద్దు చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల 45 లక్షల వాహనాలను రద్దు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆటో విడిభాగాలు 30 శాతం చౌకగా దొరుకుతాయి.

ప్రస్తుతం అల్యూమినియం దుబాయ్, ఆస్ట్రేలియా, యుఎస్ వంటి దేశాల నుంచి వస్తుంది, దీని ధర కిలో 145 రూపాయలు. స్క్రాప్ నుంచి వచ్చే లోహం ధర కిలో రూ.80 అవుతుందని ఆయన తెలిపారు.