Fri. Nov 22nd, 2024
Forbes-Richest-Indian-Women_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఏప్రిల్ 8,2023: ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది (ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2023). తాజాగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో భారతీయ మహిళలకు చోటు కల్పించింది.

ఈ జాబితా ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ. అత్యంత ధనవంతులైన టాప్-ఫైవ్ భారతీయ మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సావిత్రి జిందాల్ ($17 బిలియన్ డాలర్లు)..

Forbes-Richest-Indian-Women_365

ఫోర్బ్స్ ప్రకారం, జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 73 ఏళ్ల సావిత్రి జిందాల్ ఆరో స్థానంలో నిలిచారు. అదే సమయంలో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 94వ స్థానంలో నిలిచారు. సావిత్రి జిందాల్ ఆస్తులు 17 బిలియన్ డాలర్లు (13,91,31,82,50,000 రూపాయలు).

రోహికా సైరస్ మిస్త్రీ (7 బిలియన్ డాలర్లు)

రోహికా సైరస్ మిస్త్రీ దివంగత సైరస్ మిస్త్రీ భార్య. రోహికా స్వయంగా కార్పొరేట్ ఐకాన్, కొన్ని ప్రైవేట్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నారు. 55 ఏళ్ల రోహికా సైరస్ మిస్త్రీ నికర విలువ 7 బిలియన్ డాలర్లు. ఆమె దివంగత నిర్మాణ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీకి కోడలు.

రేఖా జున్‌జున్‌వాలా ($5.1 బిలియన్ డాలర్లు)

బిగ్ బుల్‌గా పేరుగాంచిన పెట్టుబడిదారుడు దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా దేశంలోని ధనవంతులైన మహిళల్లో ఒకరు. 59 ఏళ్ల రేఖా ఝున్‌ఝున్‌వాలా నికర విలువ 5.1 బిలియన్ డాలర్లు. విశేషమేమిటంటే, జుంఝన్‌వాలా పోర్ట్‌ఫోలియోలో టైటాన్, స్టార్ హెల్త్,అలైడ్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్‌లు ఉన్నాయి.

Forbes-Richest-Indian-Women_365

వినోద్ రాయ్ గుప్తా ($4 బిలియన్ డాలర్లు)

వినోద్ రాయ్ గుప్తా.. హావెల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తల్లి, ఆమె పేరు భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఉంది. ఆమె మొత్తం నికర విలువ $4 బిలియన్ల డాలర్లు. హావెల్స్ ఇండియా ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, స్విచ్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ సంబంధించిన వివిధ వస్తువులను తయారు చేస్తుంది.

సరోజ్ రాణి గుప్తా ($1.2 బిలియన్ డాలర్లు)

సరోజ్ రాణి గుప్తా మహాలక్ష్మి ఎసోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. 72 ఏళ్ల సరోజ్ రాణి గుప్తా మొత్తం ఆస్తులు 1.2 బిలియన్ డాలర్లు. ఆమె APL అపోలో ట్యూబ్స్ సహ వ్యవస్థాపకురాలు కూడా.

error: Content is protected !!