365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 27డిసెంబర్,2021: ఈ ఏడాది భారత మార్కెట్లోకి కొన్నిఅప్డేటెడ్ బైక్స్, మరికొన్ని కొత్త మోడల్ బైక్స్ వచ్చాయి.అటువంటి వాటిని గురించి నెటిజన్స్ విపరీతంగా సెర్చ్ చేశారు. అవేంటంటే..?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350:ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్ సెర్చ్‌లో వెతికిన టాప్ 10 బైక్స్ లో “రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ -350” మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో గూగుల్‌లో ప్రతి నెల 8 లక్షల సార్లు సెర్చ్ చేశారట.
యమహా ఎమ్‌టి-15:2021లో గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన రెండో బైక్ యమహా ఎమ్‌టి-15. ఈ బైక్ ను ప్రతి నెల 5.5 లక్షల సార్లు సెర్చ్ చేసారు.
కేటీఎమ్ ఆర్‌సీ 200: దేశీయ మార్కెట్లో ఎక్కువమంది బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్స్ లో ఇది ముందువరుసలో నిలిచింది.కేటీఎమ్ కంపెనీ ఆర్‌సి 200 బైక్ 2021లో అత్యధికంగా శోధించిన బైకుల జాబితాలో టాప్ 10 లో మూడో బైక్ గా నిలిచింది. ఈ బైక్ గూగుల్‌లో ప్రతి నెలా 4.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు నెటిజన్స్.
బజాజ్ పల్సర్ 125:బజాజ్ ఆటో సంస్థకు చెందిన బజాజ్ పల్సర్ 125 బైక్ గూగుల్‌లో ఎక్కువగా వెతికిన బైక్స్ లో ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. బజాజ్ పల్సర్ 125 బైక్ ను ప్రజలు గూగుల్‌లో 3.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు.
యమహా ఆర్15: ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో వెతికిన టాప్ టెన్ బైకులతో జాబితాలో యమహా ఆర్-15కు ఐదోస్థానం దక్కింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్:మార్కెట్లో అత్యంతగా ఆదరణపొందిన టూవీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కు చెందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఆరో స్థానంలో నిలిచింది.
కేటీఎమ్ ఆర్‌సీ390: కేటీఎమ్ ఆర్సీ 390 బైక్ ను గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా సర్చ్ చేశారు. ఇది ఏడో స్థానంలో ఉన్నది.
సుజుకి హయబుసా: నివేదిక ప్రకారం ఈ బైక్ ను ప్రతి నెల దాదాపు 3 లక్షల సార్లు సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సుజుకి మోటార్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ బైక్ “సుజికి హయబుసా” కు 2021లో గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కింది. ఇది దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న కాస్ట్లీ బైక్ కూడా. ఈ బైక్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
హీరో స్ప్లెండర్ ప్లస్: ఇది అత్యంతగా అమ్ముడైన ఉత్తమ బైక్ గా నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన వెహికల్ గా, ముందువరుసలో స్థానం సంపాదించగలిగింది. ఈ ఏడాది అత్యధికంగా శోధించిన టాప్ టెన్ బైక్స్ జాబితాలో దీనికి తొమ్మిదో స్థానం దక్కింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350: 2021 సంవత్సరంలో టాప్ టెన్ లిస్ట్ లో” రాయల్ ఎన్‌ఫీల్డ్ “కు చెందిన బైక్స్ మూడు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350ను ఎక్కువగా యూత్ కోరుకున్నారు. గూగుల్ లో వెతికిన టాప్ టెన్ జాబితాలో ఈ బైక్ పదో స్థానంలో నిలిచింది.