Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 29,2023: తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల సందడి షురూ అయ్యింది..! ఐదు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తెలంగాణలో ఎమ్మెల్యేగా ఐదు సార్లకుపైగా విజయం సాధించిన నాయకులు ఉన్నారు. ఎవరెవరంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ వేళ, తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతల గురించి తెలుసుకుందాం. ఈ ఘనత సాధించిన నేతలు 45 మందికి పైగా ఉన్నారు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఆయన ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018).

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ ఇద్దరూ ఏడుసార్లు ఎన్నికయ్యారు.1983, 1985లో టీడీపీ టికెట్‌పై, ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందారు జానా రెడ్డి.

2004, 2008 (బై పోల్), 2009, 2010 (బై పోల్), 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) టికెట్‌పై ఈటెల రాజేందర్ గెలుపొందారు. 2021లో బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు.

జి. గడ్డెన్న, టి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాస రెడ్డి, సి రాజేశ్వర్ రావు, టి హరీష్ రావు, డాక్టర్ ఎం చెన్నా రెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవ రెడ్డి సహా వీరంతా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నాయకులలో జె రాజారాం, గంప గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి విఠల్ రెడ్డి, కె హరీశ్వర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసీ, సలావుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్, జి సాయన్న, డాక్టర్ పి శంకర్ రావు, గుర్నూత రెడ్డి, జె కృష్ణారావు, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి గోవర్ధన్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు.

error: Content is protected !!