365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, అక్టోబర్18,2022: తెల్లవారు ఝామున 4 గంటలకు మా రూముల తలుపులు బాది రకరకాల విన్యాసాలు చేశారు. మూడు గంటలకు, నాలుగు గంటలకు, 5 గంటలకు అరెస్టు చేస్తామన్నారు. గదుల నుంచి బయటకు రాకూడదని హుకుం జారీ చేశారు. సెక్షన్ 30 కింది పవన్ కళ్యాణ్ కి నోటీసులు జారీ చేయాలన్నారు. అడ్డుకున్నాం. మన పార్టీ న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు చాలా గొప్పగా నిలబడ్డారు.
నాగబాబు ఏడున్నర గంటలకే వచ్చేశారు. నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అడిగాం. మేమేం సమాజాన్ని విచ్ఛిన్నం చేయానికి రాలేదు. ప్రజా సమస్యల మీద అర్జీలు తీసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. పోలీసులు నాలుగు గంటల పాటు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాలని వాదించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మా పార్టీ క్రియాశీలక సభ్యులు మరణిస్తే.. 12 కుటుంబాలకు జనవాణి కార్యక్రమంలో రూ. 60 లక్షల సాయం అందచేయాల్సి ఉంది.
అయితే కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేసిన నాయకులు లేకుండా జనవాణి ఎలా చేస్తాం. మా నాయకుల్ని విడిచిపెట్టినప్పుడే జనవాణి నిర్వహిద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. చివరికి మీడియా సమక్షంలో ఆ 12 కుటుంబాలకు రూ. 60 లక్షలు అందించామని, పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే విశాఖ వచ్చారని నాదెండ్ల మనోహర్ అన్నారు.