Sat. Nov 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్‌ 7,2023:మూడు సెషన్ల వరుస లాభాలకు విరామం! దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

ఐరోపా స్టాక్స్‌ 600 ఈక్విటీ సూచీ ఫ్లాట్‌గా మొదలవ్వగా అమెరికా ఈక్విటీ ఫ్యూచర్లు నష్టపోయాయి. దక్షిణ కొరియా కోస్పీ రెండు శాతం వరకు పతనమైంది. 64,900 వద్ద ఇంట్రాడే గరిష్ఠ నుంచి పడిపోయిన సెన్సెక్స్‌ ఆఖర్లో 300 పాయింట్ల మేర పుంజుకుంది.

19,400 వద్ద కీలకమైన నిరోధం ఉండటంతో నిఫ్టీ ఊగిసలాడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఐదు పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది. సూచీలు ఇదే స్థాయుల్లో కొనసాగితే ఇన్వెస్టర్లు మంచి కంపెనీల షేర్లను డిప్స్‌లో కొనడం మేలు.

క్రితం సెషన్లో 64,958 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,021 వద్ద లాభాల్లో మొదలైంది. క్రమంగా తగ్గుతూ 64,638 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఆపై పుంజుకొని 65,021 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది.

చివరికి 16 పాయింట్ల నష్టంతో 64,942 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,404 వద్ద మొదలై 19,329 వద్ద ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయికి తగ్గింది. 19,423 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ మొత్తంగా 5 పాయింట్లు పతనమై 19,406 వద్ద క్లోజైంది.

నిఫ్టీ బ్యాంకు 118 పాయింట్లు ఎగిసి 43,737 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభపడగా 20 నష్టపోయాయి.

సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్. హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివిస్ ల్యాబ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లాసర్స్.

రంగాల వారీగా పరిశీలిస్తే మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి

నిఫ్టీ ఫ్యూచర్స్‌ నవంబర్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,500 వద్ద బలమైన రెసిస్టెన్సీ, 19,380 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో ట్రెంట్‌, బీఎస్‌ఈ, హింద్‌ పెట్రో, టాటా కన్జూమర్‌ షేర్లను కొనొచ్చు. నిఫ్టీ నష్టాల్లో హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ కీలకంగా ఉన్నాయి.

ట్రెంట్‌ రెండో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 52.73 శాతం పెరిగింది. రూ.1953 కోట్ల నుంచి రూ.2,982 కోట్లకు చేరుకుంది.

నికర లాభం రూ.78.9 కోట్ల నుంచి రూ.228 కోట్లకు పెరిగింది. ఆదిత్య బిర్లా రెన్యూవబుల ఎనర్జీ నుంచి కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ 22.3 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు దక్కించుకుంది.

కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ స్టాక్‌ స్ల్పిట్‌ చేయనుంది. ప్రతి షేరును రెండుగా విభజించనుంది. ఆల్కెమ్‌ లేబోరేటరీస్‌ నికర లాభం 76 శాతం మేర ఎగిసింది.

మిలన్‌లోని ఈఐసీఎంఏలో తొలి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ కాన్సెప్ట్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆవిష్కరించింది. ప్రిఫరెన్షియల్‌ విధానంలో అలోక్‌ ఇండస్ట్రీస్ రూ.3,300 కోట్లను సమీకరించనుంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!