Mon. Jul 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 21 జూన్, 2024: “అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్ లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యత మన ఆత్మల లోపల ఉంది.

‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం. అన్ని ఆత్మలూ అంతరికంగా వాంఛించే అసలైన కలయిక. ఈ భూమిపై జీవించే మానవుల్లో చాలామంది ‘యోగ’ అన్న మాట వినే ఉంటారు. కానీ వారిలో అత్యధికులు యోగ అంటే శారీరక వ్యాయామాలైన యోగాసనాలు (హఠ యోగం) గా భావిస్తారు. అయినప్పటికీ యోగంలో మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక గ్రంథం “ఒక యోగి ఆత్మకథ” రచయిత అయిన పరమహంస యోగానంద సత్యాన్వేషకులకు యోగం అంటే అసలైన అర్థాన్ని తెలియజెప్పడానికి పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించారు.

జీవితానికి అసలైన అర్థాన్ని తెలుసుకోగోరే అన్వేషకులు అనుసరించవలసిన ‘కార్యాచరణ ప్రణాళిక’లో ధ్యానం విడదీయరాని భాగమని ఉద్ఘాటించిన ఆయన బోధన కాలానుగుణమైనది, కాలాతీతమైనది.

జీవితపు అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారం లేదా దైవంతో ఏకత్వం సాధించడం అనేది ఆధ్యాత్మిక కృషి వల్లనే సాధ్యమవుతుందని యోగానంద ప్రతిపాదించారు. ఇక ఆయన గురువైన శ్రీయుక్తేశ్వర్ గిరి చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. “నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.”

యోగానంద “ఒక యోగి ఆత్మకథ“ గ్రంథంలో ప్రస్తావించిన అత్యున్నత సత్యాలను సాధించే దిశగా చేసే తన ప్రయత్నాలు ఫలించాలంటే ప్రతి భక్తుడూ అంచెలంచెలుగా సాధన చేయగలిగిన శాస్త్రీయమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఒకటి తప్పక అవసరమవుతుంది.

క్రియాయోగ యోగం ,అత్యున్నత స్వరూపం. దైవ సంసర్గం సాధించడానికి మానవులకు తెలిసిన సర్వశ్రేష్ఠ మార్గం. క్రియాయోగంలో ఉన్న నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రక్రియలు సాధకుడికి తన భౌతిక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాక ఆ ‘యోగి’ క్రమేపీ అసలైన శాంతి, ఆనందం-మనలోపల దైవసాన్నిధ్యపు ఉనికికి సూచనలు-కనుగొనగలిగేలా చేస్తాయి.

క్రియాయోగ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించదగినదని, అస్తిత్వపు అత్యున్నత తలానికి చేరుకొనే తిరుగులేని మార్గమని యోగానంద తన ప్రాచ్య, పాశ్చాత్య శిష్యులిరువురికీ వివరించారు.

కొన్ని ప్రారంభ ప్రక్రియలకు ఆయన వివరణ ఇవ్వడంతో పాటు అత్యున్నత మెట్టయిన క్రియాయోగ ధ్యానమనే ద్వారానికి దారితీసే ‘జీవించడం ఎలా’ అనే తన తత్వబోధ కూడా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా క్రియాయోగాన్ని గురించి రెండుసార్లు గొప్పగా ప్రస్తావించాడు.


క్రియాయోగాన్ని దాని లక్షణాలతో తమ జీవన విధానంగా స్వీకరించడానికి లక్షలాది మంది ప్రేరణ పొందారు. అయితే క్రియాయోగ వల్ల కలిగే లాభం దానిని శ్రద్ధగా అభ్యసించడంలో ఉందని శ్రీయుక్తేశ్వర్ గిరి గురువు లాహిరీ మహాశయులన్నారు.

మన ఉనికికి పైనుండే ఉన్నత స్థాయిలలోకి ప్రవేశించడానికి స్వర్ణ ద్వారం క్రియాయోగ ప్రక్రియను క్రమం తప్పకుండా, సరైన విధంగా అభ్యసించడం వల్లనే వస్తాయి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యోగానంద 1917 లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ. వై.ఎస్.ఎస్. యోగానంద విస్తారమైన రచనలపై గాఢమైన అంతర్దృష్టి ప్రసరింపచేసే విధంగా పుస్తకాలు, ముద్రిత పాఠాలు, ఇతరముల ద్వారా వ్యాప్తి చెందిస్తూ పనిచేస్తున్నన్నది.


ఇటీవలి దశాబ్దాలలో క్రియాయోగ మార్గాన్ని అనుసరించే భక్తుల సంఖ్య భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అపారంగా పెరిగింది. మరింత సమాచారం కోసం: yssi.org

Also read : Vraj Iron And Steel Limited Initial Public Offer to Open on June 26, 2024

ఇది కూడా చదవండి :తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిన జియో జోరు

Also read : Premier Energies Limited has been recognized as Great Place to Work for third consecutive year and Best in Industry

Also read : Today World Music Day 2024