వింటర్ స్పార్–నివాల్‌లో 8కు పైగా స్పెషాలిటీ పండుగలతో పాటుగా 30కు పైగా ఉత్పత్తి విభాగాలు ఓ నెల రోజుల కాలంలో జరునున్నాయి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్,31 ,2021: ముఖ్యమైన 2020వ సంవత్సర ముగింపునకు మనం చేరుకున్నాం, చివరకు ఇది కొనుగోలుదారులకు ‘ సీజన్ ఆఫ్ జాయ్’గా మారబోతుంది ! స్పార్ హైపర్‌మార్కెట్ తమ వార్షిక సీజన్ ఆఫ్ జాయ్‌ను వరుసగా నాలుగవ సంవత్సరం చేయబోతుంది. ఈ సీజన్ ఆఫ్ జాయ్‌లో విస్తృతశ్రేణి చేపలు, మాంసం అందుబాటులో ఉంటుంది. వీటిలో టర్కీ, కుందేలు, క్విల్, అట్లాంటిక్ సాల్మన్ వంటివి క్రిస్మస్ వేడుకల కోసం అందుబాటులో ఉంచితే, హార్వెస్ట్ ఫెస్టివల్ లో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాలలో పండించిన వరి రకాలను అందుబాటులో ఉంచారు. ఈ ఫెస్ట్ ఇప్పుడు మరింత పెద్దగా ,ఉత్తమంగా మారడంతో పాటుగా 10స్పెషాలిటీ మినీ ఫెస్టివల్స్ సైతం దీనిలో భాగంగా జరుగుతున్నాయి ఎగ్ ఫెస్టివల్‌లో భాగంగా 20 రకాల దేశీ గుడ్లు, క్విల్ ఎగ్స్, డబుల్‌యోక్ ఎగ్స్ వంటివి అందుబాటులో ఉంచారు.దీనిలోనే ఉత్సాహపూరితమైన వింటర్ ఫెస్ట్ సైతం అందుబాటులో ఉంటుంది. దీనిలో దుప్పుట్లు, వార్మర్స్,అప్పెరల్స్, థర్మల్ వేర్ సైతం అందుబాటులో ఉంది. అంతేనా… షాప్‌లోకి ప్రవేశించే ముందు అందుబాటులో ఉండే మనీ పాట్ నుంచి డబ్బు తీసుకుని షాప్‌లో కొనుగోలు చేయవచ్చు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం!ఈ సీజన్ ఆఫ్ జాయ్ ఫెస్ట్ హైదరాబాద్‌లోని స్పార్ హైపర్‌మార్కెట్‌లలో జనవరి 15వ తేదీ వరకూ జరుగనుంది.ఈ నాల్గవ వార్షిక సీజన్ గురించి విపిన్ భండారీ – ఎండీ అండ్ సీఈవో– స్పార్ హైపర్‌మార్కెట్ మాట్లాడుతూ ‘‘ఈ కోవిడ్ సంక్షోభ కాలంలో, మా స్టోర్లు అన్నింటి వద్దా భద్రత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ సంవత్సరం కార్నివాల్‌ను మరింతపెద్దగా, మరింత ప్రత్యేకంగా మలిచాం..’’అని అన్నారు.