365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, జనవరి 10,2023: కొత్త సంవ త్సరం రెండో వారం మొదలైంది. ఈ వారం చాలా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం పాత చిత్రాలే థియేటర్లలో నడుస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ అవతార్ 2 బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కొనసాగిస్తుండగా, మరాఠీ చిత్రం వేడ్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది.
కాగా, దృశ్యం-2 ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది. సర్కస్ అంతగా ఆకట్టు కోలేకపోతోంది. మరి సోమవారం వరకూ ఏ సినిమా ఎంత రాబట్టిందంటే..?
అవతార్ -2 : ది వే ఆఫ్ వాటర్
జేమ్స్ కామెరూన్ చిత్రం అవతార్-2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. విదేశాల్లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను కొనసాగిస్తోంది.
సోమవారం లెక్కల ప్రకారం ఈ సినిమా 3కోట్ల బిజినెస్ చేసింది. విడుదలై 25వరోజుకు చేరుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.374.50 కోట్లకు చేరుకుంది.
దృశ్యం -2
అజయ్ దేవగన్ దృశ్యం-2 మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ రాబడు తోంది. ఈ సినిమా విడుదలై ఏడో వారం కావొస్తున్నా ఇంకా థియేటర్లలో వసూళ్లు రాబడుతోంది.
అయితే, ఇప్పుడు దాని వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దృశ్యం -2 53వ రోజుకు చేరుకోగా సోమవారం 30 లక్షలు వసూలు చేసింది. ఇప్పటివరకు దృశ్యం-2 వసూళ్లు 238.96 కోట్లకు చేరాయి.
వేడ్..
రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా జంటగా నటించిన మరాఠీ చిత్రం “వేడ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. రితీష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇక సోమవారం ఈ సినిమా 2.50 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్లు రూ.35.92 కోట్లకు చేరాయి.
సర్కస్..
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన “సర్కస్” ప్రేక్షకులను అంతగా ఆకట్టు కోలేకపోయింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ వంటి స్టార్స్ నటించారు.
ఓపెనింగ్ రోజునే నిదానంగా మొదలైన సర్కస్ రోజురోజుకూ పతనాన్ని చవిచూస్తోంది. అదే సమయంలో ప్రాథమిక లెక్కల ప్రకారం, ఇది దాదాపు రూ.37 కోట్లు వసూలు చేయగలిగింది.