365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 14, 2021 గోద్రేజ్ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ గోద్రేజ్ అండ్ బాయ్‌సీ తమ వ్యాపార విభాగం,హోమ్ అప్లయెన్సెస్ పరిశ్రమలో అగ్రగామి సంస్ధలలో ఒకటైన గోద్రేజ్ అప్లయెన్సెస్ తమ బ్రాండ్ సిద్ధాంతమైన ‘సోచ్ కే బనాయా హై’కి అనుగుణంగా భారతదేశపు మొట్టమొదటి పూర్తి పర్యావరణ అనుకూల ఆర్290 హైడ్రో కార్బన్ రిఫ్రిజెంట్‌తో తయారుచేసిన ఎయిర్‌కండీషనర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ ఎయిర్ కండీషనర్ జీరో ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ (ఓడీపీ),అతి తక్కువగా కేవలం 3 మాత్రమే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యుపీ) ని అందిస్తుంది. ఈ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవ వేళ, ఈ బ్రాండ్ తమ నిబద్ధతను పర్యావరణం పట్ల చూపడంతో పాటుగా ప్రత్యేకమైనమార్పిడి ఆఫర్‌తో తమపాత ఎయిర్ కండీషనర్‌ను మార్చుకునే అవకాశం అందిస్తుంది.
ఆర్ 22 రిఫ్రిజిరెంట్ కలిగిన ఏసీలకు 2000 వేల రూపాయలను ఈ బ్రాండ్ అందిస్తుంది. ఈ ఆఫర్ అన్ని గోద్రేజ్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్లు, గ్రీన్ ఏసీ హబ్స్,
ప్రాధాన్యత బ్రాండ్ ఔట్‌లెట్లు వద్ద 16 సెప్టెంబర్ 2021వ తేదీ మాత్రమే అందుబాటులో ఉంటుంది.గోద్రేజ్ ఏసీలు ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటుగా కంప్రెషర్‌పై 10 సంవత్సరాల వారెంటీతో వస్తాయి.ఈ పర్యావరణ అనుకూల ఏసీలు 1టీఆర్, 1. 5 టీఆర్, 2 టీఆర్ సామర్థ్యంలలో 3 స్టార్,5 స్టార్ రేటింగ్స్‌లో లభ్యమవుతాయి. ఇవి వినూత్నమైన ఫీచర్లు అయినటువంటి నానో కోటెడ్ యాంటీ వైరల్ ఫిల్టర్, ట్విన్ రోటరీ కంప్రెషర్, స్మార్ట్ డయాగ్నోసిస్, 52 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద హెవీ డ్యూటీ కూలింగ్,యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ వంటి ఫీచర్లెన్నో కలిగి ఉంది.
గోద్రేజ్ అప్లయెన్సస్,ప్రొడక్ట్ గ్రూప్ హెడ్-ఎయిర్ కండీషనర్స్ సంతోష్ సలియన్ మాట్లాడుతూ ‘‘అతి తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ కలిగిన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మేమెప్పుడూప్రయత్నిస్తుంటాము. ఆర్ 290 రిఫ్రిజరెంట్‌తో మా పోర్ట్‌ఫోలియో తీర్చిదిద్దడం దానికి ఓ నిదర్శనం.ఆర్22 రిఫ్రిజిరెంట్ కలిగిన ఎయిర్ కండీషనర్లను పర్యావరణ అనుకూల,ఇంధన సామర్థ్యం కలిగిన గోద్రేజ్ ఎయిర్‌కండీషనర్ శ్రేణితో మార్చుకోవాల్సిందిగా మా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాం.తద్వారా వారు పర్యావరణానికి మేలు చేయడంతో పాటుగా తమ విద్యుత్ బిల్లులను కూడా తగ్గించుకోగలరు’’ అని అన్నారు.