365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, మార్చి 21, 2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ సభ్యులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది.

ఫ్యాకల్టీ సభ్యుల్లో సామర్థ్యాల పెంపునకుద్దేశించిన ఈ కార్యక్రమంలో PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి… భారత మార్కెట్‌లో సియట్ సంచలనం – స్పోర్ట్‌డ్రైవ్ సిరీస్‌లో గ్లోబల్ టెక్నాలజీస్ ఆవిష్కరణ

ఇది కూడా చదవండి… ఏఐ పరివర్తనకు ఊపందిస్తూ ఎయిర్ న్యూజిల్యాండ్‌తో భాగస్వామ్యంతో టీసీఎస్”

సమయపాలన, నిజాయితీలే వృత్తిపరంగా విజయాలకు దోహదం చేస్తాయని ఆయనన్నారు. అదేవిధంగా ఆర్థిక వనరుల యాజమాన్యం చాలా ముఖ్యమైందని రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch విద్యాసాగర్ వివరించారు.

రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. 40 మంది ఫ్యాకల్టీ సభ్యులకి అధునాతన బోధనా పద్ధతులు, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై 12 సెషన్స్ లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. PJTAU పరిధిలో తెలంగాణలో ఉన్న కళాశాలల నుంచి ఫ్యాకల్టీ సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Read this also…CEAT Introduces Global Tyre Technologies in India with SportDrive Range

Read this also…Sur Mahal – The Patiala Baithaks: A Regal Revival of Patiala’s Musical Heritage

ఈ కార్యక్రమంలో PJTAU డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ K. ఝాన్సీరాణి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ KB. ఈశ్వరి లు గెస్ట్ ఆఫ్ హానర్ గా పాల్గొన్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ K. సురేష్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ M. ప్రీతి తదితరులు దీనిలో పాల్గొన్నారు.