365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 10,2022:ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల చేపే మాటల కారణంగా, పోలీసులు మాట్లాడుతూ, మరొక వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్నవారు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. కారులో ఉన్నవారు మృతదేహాలు బాగా నలిగి పోయి ఉన్నాయి వాటిని బయటకు తీయడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు.
మృతులు నందిపేటకు చెందిన అశోక్, మోహన్, రమేష్‌లుగా గుర్తించారు.