365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,నవంబర్ 15,2022: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన మూడు నెలల పాప మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే భట్టిప్రోలుకు చెందిన మౌనిక అనే మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడు నెలల చిన్నారిని రేపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది.
చిన్నారిని అడ్మిట్ చేసుకున్న వైద్య సిబ్బంది బాబును తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్నారి బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. 5 గంటలకు బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.
బాలుడి మరణవార్త విన్న తల్లి స్పృహ తప్పి పడిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు.
వైద్యులు అసలు వైద్యం చేయలేదని, నర్సుల ఆధ్వర్యంలోనే వైద్యం అందించామని తెలిపారు. నర్సుల చికిత్స వల్లే తమ బిడ్డ చనిపోయిందని, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.