Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,మే 6,2023:స్మార్ట్‌ఫోన్ నేడు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా ప్రజలు జీవించడం కష్టంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌ కు కొద్ధి సమయం దూరంగా ఉండాలంటే చాలు తెగ ఆందోళన పడుతుంటారు.

ఇప్పుడు తాజాగా ఓ సర్వేలో కూడా ఇదే విషయం రుజువైంది. ఇటీవల Oppo అండ్ Counterpoint సంయుక్తంగా స్మార్ట్‌ఫోన్ వ్యసనంపై ఒక సర్వే నిర్వహించాయి. ఈ సర్వేకు ‘నోమోఫోబియా’ అని పేరు పెట్టారు.

ఈ సర్వే ప్రకారం, 65 శాతం మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లతో మానసికంగా కనెక్ట్ అయ్యారు. ఇంటర్ నెట్ డేటా అయిపోవచ్చు, ఫోన్ పోవచ్చు, బ్యాటరీ అయిపోవచ్చు అని ఎప్పుడూ భయపడుతూనే ఉంతున్నారట. NoMoPhobia అనేది నో మొబైల్ ఫోబియాకి సంక్షిప్త పదం. ఇది ఒక రకమైన భయం, దీనిలో మొబైల్ పనిచేయదు అనే భయం ప్రజలకు ఉంటుంది.

60 శాతం మంది వినియోగదారులు ఫోన్‌లోని బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా అయి పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.Oppo,Counterpoint రెండూ కలిసి చేసిన ఈ సర్వేకు 1,500 మంది ప్రతిస్పందించారు. ఈ సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీసమస్య కారణంగా రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంగీకరించారు.

ఈ సర్వేపై Oppo ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా మాట్లాడుతూ, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఈ సర్వే మాకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు మొబైల్ గురించి ఆందోళన చెందుతున్నారు. మొబైల్‌ విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది పురుషులు ఫోన్ విషయంలో ఎక్కువ టెన్షన్‌తో ఉన్నారని , ఇంటర్నెట్ గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 92.5 శాతం మంది పవర్ సేవింగ్ మోడ్‌ని ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడే ఉపయోగిస్తామని చెప్పారు. 42 శాతం మంది వినియోగదారులు వినోదం కోసం ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు

సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది తమ ఫోన్‌లను వినోదం కోసం ఉపయోగిస్తున్నారని, వీరంతా వినోదం కోసం సోషల్ మీడియాపై ఆధారపడినట్లు అంగీకరించారు. దాదాపు 65 శాతం మంది ప్రజలు బ్యాటరీని ఆదా చేయడానికి చాలాసార్లు ఫోన్ ఉపయోగించడం మానేయాలని చెప్పారు.

error: Content is protected !!