365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కేశాపురం,ఆగష్టు 28,2022: అన్నమయ్య జిల్లా కేశాపురం వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చిన్నమండె మండలానికి చెందిన సోదరులు గఫార్ ఖాన్, ముక్తియార్ మరొకరితో కలిసి కారులో మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది .
కేశాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. గఫార్ ఖాన్, ముక్తియార్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.