365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూయార్క్,జూలై10, 2022: ముగ్గురు మహిళలు అమెరికాలోని ఓ రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రెస్టారెంట్‌లోని కంప్యూటర్లు,క్యాష్ రిజిస్టర్,ఇతర వస్తువులను సైతం ధ్వంసం చేశారు. ఈ సంవర్భంగా రెస్టారెంట్ ఉద్యోగిపై కూడా దాడి చేయడంతో గాయపడగా ఆ బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు మహిళా కస్టమర్‌లు న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ లో హల్ చెల్ చేశారు. అదనపు సాస్ కోసం రూ.130 చెల్లించాలని రెస్టారెంట్ సిబ్బంది బిల్లు వేయడంతో వివాదం తలెత్తింది.
Watch the video :

ఈ వివాదంలో రెస్టారెంట్ పై దాడికి పాల్పడిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. టిక్‌టాక్‌లో మొదట షేర్ చేసిన ఈ విజువల్క్స్ ఆతర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు స్టూల్, గాజు సీసాలు విసిరినట్లు కనిపిస్తుంది. వీరు రెస్టారెంట్ ఉద్యోగులను దుర్భాషలాడడమేకాకుండా అక్కడి సామాన్లు ధ్వంసం చేశారు.

ఈ సంఘటన జూలై 4న మాన్‌హట్టన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లోని బెల్ ఫ్రైస్‌లో జరిగింది. ముగ్గురు మహిళలను అరెస్టు చేసి దోపిడీ, నేరపూరిత దుశ్చర్యలకింద కేసునమోదు చేశారు పోలీసులు. ముగ్గురు మహిళా కస్టమర్లు అదనపు సాస్ కావాలని కోరగా అందుకు అదనంగా బిల్లువేశమని ఆ బిల్లు చెల్లించకపోగా రెస్టారెంట్ పై దాడికి పాల్పడ్డారని రెస్టారెంట్‌కు చెందిన చెఫ్ రాఫెల్ నునెజ్ చెప్పారు. దాడికి పాల్పడిన ముగ్గురు మహిళలను 27 ఏళ్ల పెరల్ ఓజోరియా, 25 ఏళ్ల చితారా ప్లాసెన్సియా, 23 ఏళ్ల తాటియన్నా జాన్సన్‌గా గుర్తించారు. పోలీసుల నివేదికల ప్రకారం ముగ్గురు కస్టమర్లు రెస్టారెంట్‌లోని కంప్యూటర్లు, క్యాష్ రిజిస్టర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక ఉద్యోగి కూడా గాయపడగా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Watch the video:

ఓజోరియా అరెస్ట్ అయినప్పుడు ఒక పోలీసు అధికారి ముఖంపై కొట్టినట్లు కూడా ఆరోపణలుయి. ఆమె ఇప్పుడు ఒక పోలీసు అధికారిపై దాడి చేయడం, అరెస్టును ప్రతిఘటించడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం వంటి అదనపు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మరో ఇద్దరు మహిళలపై నేరారోపణలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు నేరస్తుల్లో ఒకరికి ఒక కొడుకు ఉన్నాడు. వీరు ముగ్గురు నేరస్తులు జూలై 15న న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంది.