365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 11, 2024: భారతదేశంలో తరతరాలుగా చిన్నపిల్లలు మహాభారత కథలకు ఆకర్షితులవుతారు. ఈ మహోన్నత కావ్యంలో ఉన్న కథా మలుపులు, పన్నాగాలు, పాత్రల సంక్లిష్టతల మధ్య, దాని గుండెకాయగా భగవద్గీత సందేశం నిలిచిపోయింది. ఈ కాలాతీత ప్రబోధాన్ని స్వయంగా పరమాత్ముడు కృష్ణుడు, తన శిష్యుడు, పాండవుల వీరుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఈ అలౌకిక ఉపదేశమే భగవద్గీతగా మారి యుగయుగాలపాటు మానవాళికి ప్రేరణగా నిలుస్తోంది.

గీతాజయంతి విశిష్టత..

ప్రతి డిసెంబర్ నెలలో గీతాజయంతి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. పండితులు ఈ సందర్భంగా భగవద్గీతలోని సూక్ష్మమైన సందేశాలను విశదీకరిస్తారు. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో తన సొంత బంధువులతో పోరాడడానికి వెనకడుగు వేసిన అర్జునుడికి, కృష్ణుడు అందించిన ఈ దివ్యోపదేశం మానవత్వం, ఆత్మసాక్షాత్కారం, ధర్మాన్ని ప్రతిఫలిస్తుంది.

యోగానందగారి విశ్లేషణ..

శ్రీ శ్రీ పరమహంస యోగానంద రాసిన “గాడ్ టాక్స్ విత్ అర్జున” భగవద్గీత శ్లోకాల లోతైన అర్థాన్ని విశదీకరిస్తూ, ఆధ్యాత్మికతకు అద్భుతమైన దిశానిర్దేశం అందిస్తుంది. ఈ గ్రంథంలో ఆయన భగవద్గీతను రెండు సంపుటిలలో విశ్లేషించారు.

భగవద్గీత సారాంశం..

కృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశంలో ప్రతి మనిషి ఆత్మ స్వరూపం గురించి అవగాహన కలిగి, తమలోని నెగెటివ్ లక్షణాలను (అహంకారం, కోపం, దురాశ) జయించడానికి కృషి చేయాలని సూచించారు. యోగానందగారు వివరించినట్టుగా, మహాభారతంలోని పాండవులు, కౌరవులు మనసులోని మంచి మరియు చెడు లక్షణాలకు ప్రతీకలు.

క్రియాయోగం : భగవద్గీతలోని ఆధ్యాత్మిక మార్గం
భగవద్గీతలో క్రియాయోగం అనే ధ్యానప్రక్రియను రెండుసార్లు ప్రస్తావించారు. ఈ ప్రక్రియను మహావతార బాబాజీ నుండి లాహిరీ మహాశయుల వరకు, ఆపై యోగానందగారి వరకు గురుపరంపరలో అందించారు. క్రియాయోగ ధ్యాన పద్ధతులు ఆత్మసాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSSI) ద్వారా ఈ పాఠాలు లక్షలాది మందికి అందుబాటులో ఉన్నాయి.

భగవద్గీత: విజయం, ధర్మానికి మార్గదర్శి
భారతదేశంలో చెప్పే సామెత, “ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది ” భగవద్గీత సారాన్ని చాటి చెబుతుంది. భగవద్గీత బోధనలు అనుసరించి తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రతి వ్యక్తి అదృష్టవంతుడు.మరింత సమాచారం కోసం.. yssi.org