Fri. Dec 13th, 2024
Tiruchanoor Sri Padmavathi Devi
Tiruchanoor Sri Padmavathi Devi

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూన్13, 2022: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

Tiruchanoor Sri Padmavathi Devi

సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో చివరి రెండు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం, ఇఇ నరసింహ మూర్తి, డిప్యూటీ ఇఇ సురేష్ బాబు, ఏఇ సురేష్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఏఇ మురళీకృష్ణ, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరం, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

error: Content is protected !!