365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 24,2023: స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలను చవిచూశాయి. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 141.87 పాయింట్ల నష్టంతో 59,463.93 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 45.45 పాయింట్లు పడిపోయి 17,465.80 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి 82.74 వద్ద ముగిసింది.
ఆరో రోజు..
శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు లాభాలను కొనసాగించ లేకపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా మరియు భారతీ ఎయిర్‌టెల్ సెన్సెక్స్‌లో ప్రధానంగా నష్టపోయాయి.

మరోవైపు, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ పురోగమించాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచుతుందన్న భయాల నేపథ్యంలో ఈ తగ్గుదల చోటు చేసుకుంది.
తగ్గిన బంగారం, వెండి ధరలు
శుక్రవారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.80 తగ్గి రూ.55,840కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.55,920 వద్ద ముగిసింది. వెండి కూడా కిలో రూ.767 తగ్గి రూ.64,517 వద్ద ముగిసింది.