today Gold rates

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు16,2022: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే..? ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 52,690 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,610 ఉంది.

కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,150 ఉండగా రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 52,520 ఉంది. వెండి ధరలు.. కోల్‌కతా, చెన్నై, ముంబైలలో రూ.59,300 ఉండగా, చెన్నైలో వెండి ధర రూ.64,800 ఉంది.

గమనిక : బంగారం,వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజూ మారుతూ ఉంటాయి కాబట్టి పాఠకులు గమనించ గలరు.

అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ,అనేక ఇతర కారణాల వల్ల బంగారం రేటు మారడానికి అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనే అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.