365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, సెప్టెంబర్ 16, ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు ఈవాళ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభసమయంలో నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 17560 వద్ద, సెన్సెక్స్ 132 పాయింట్లు పెరిగి 58,855 వద్ద ట్రేడవుతున్నాయి. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు తప్ప మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నాయి. అత్యధికంగా టెలికాం సూచీ 2.7శాతం లాభపడింది. ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులు ఈ రంగంపై సానుకూల ప్రభావం చూపాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
ముఖ్యంగా ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ఉన్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ సూచీల్లో డోజోన్స్ బాగా లాభపడింది. ఎనర్జీ, ఆర్థికసేవల రంగాల షేర్లల్లో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. వొడాఫోన్ ఐడియా, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, అపోలో ట్రైకోటా ట్యూబ్స్, జేటీఈకేటీ ఇండియా, ఇండస్ టవర్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. హింద్ కాపర్, జెన్సార్ టెక్నాలజీస్ , హట్సన్ అగ్రో ప్రొడక్ట్స్, రెస్పాన్సీవ్ ఇండస్ట్రీస్, పాలీ మెడీక్యూర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.