365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 29,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్ గా స్టార్ట్ అయిన తర్వాత లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల మేర లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 107.28 (0.19శాతం) పాయింట్ల లాభంతో 57,721.00 పాయింట్ల స్థాయిలో ట్రేడవుతోంది.
మరోవైపు నిఫ్టీ 45.30 (0.27శాతం) పాయింట్ల లాభంతో 16,998.35 పాయింట్ల స్థాయిలో ట్రేడవుతోంది. అంతకు ముందు మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కాగా ఆసియా షేర్లు బలాన్ని ప్రదర్శించాయి. ఆసియా మార్కెట్‌లో ముడిచమురు ధరలు వరుసగా మూడో రోజు బుధవారం కూడా పెరిగాయి. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్, అదానీ గ్రూప్ షేర్లు కాస్త జోరందుకున్నాయి.