365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 5,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అదరగొడుతు న్నాయి. వరుసగా రెండో సెషన్లో రికార్డు గరిష్ఠాల్లో ముగిశాయి. బ్యాంకు, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, అదానీ స్టాక్స్ ఇందుకు దన్నుగా నిలిచాయి.
అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 17 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ 14 శాతంతో దుమ్మురేపింది. భారత్ గ్రోత్ స్టోరీ, స్థిరమైన ప్రభుత్వమే ఉంటుందున్న అంచనాలను మార్కెట్లను నడిపిస్తున్నాయి.
ఆసియా, అంతర్జాతీయా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం మరో కారణం. నేడు నిఫ్టీ 168, సెన్సెక్స్ 431 పాయింట్ల మేర పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.38 వద్ద స్థిరపడింది. ఫియర్ ఇండెక్స్ విక్స్ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
క్రితం సెషన్లో 68,865 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 69,168 వద్ద మొదలైంది. 69,381 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. కాసేపటికే పతనమై ఇంట్రాడే కనిష్ఠమైన 68,954ను తాకింది. ఆపై క్రమంగా పుంజుకొని 431 పాయింట్ల లాభంతో 69,296 వద్ద ముగిసింది.
మంగళవారం 20,808 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,864 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 20,711 వద్ద కనిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 168 పాయింట్లు పెరిగి 20,855 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 580 పాయింట్లు ఎగిసి 47,012 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 32 కంపెనీలు లాభపడగా 18 నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.
ఎల్టీఐ మైండ్‌ట్రీ, హిందుస్థాన్ యునీలివర్, దివిస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో టాప్ లాసర్స్. నేడు ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు అదరగొట్టాయి.
నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఛార్టును పరిశీలిస్తే 21000 వద్ద రెసిస్టెన్సీ, 20850 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి పవర్ గ్రిడ్, ఫైన్ ఆర్గానిక్, టాటా కెమికల్స్, కొటక్ బ్యాంకు, మారుతీ షేర్ల కొనుగోలు పరిశీలించొచ్చు. కాగా నిఫ్టీ పెరుగుదలలో ఐసీఐసీఐ బ్యాంకు (35), అదానీ ఎంటర్ ప్రైజెస్ (32), అదానీ పోర్ట్స్ (24), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (24) కీలక పాత్ర పోషించాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.210 చొప్పున 10.3 లక్షల షేర్లు చేతులు మారాయి. 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకిని అదానీ గ్రీన్ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. రూ.1376 చొప్పున సఫైర్ ఫుడ్స్‌లో 24.6 లక్షల షేర్లు చేతులు మారాయి.
89,404 కిలో లీటర్ల ఇథనాల్ సరఫరా చేస్తామని ప్రకటించడంతో గుల్షన్ పాలీయోల్స్ షేర్లు నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకాయి. రూ.2100 కోట్ల హౌజింగ్ ప్రాజెక్టు ఒప్పందం చేసుకోవడంతో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ రికార్డు స్థాయికి చేరింది. అంబుజా సిమెంట్స్ 7, హిందుస్థాన్ కన్స్‌స్ట్రక్షన్ షేర్లు 9 శాతం మేర పెరిగాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709.