Thu. Dec 5th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 3,2024: భారతదేశంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలలో ఒకటైన శ్రీరామ్ గ్రూప్ ప్రధాన అనుబంధ సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, “మ‌న‌మంతా క‌లిసి ఎదుగుదాం” అనే కొత్త బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రచారంతో, నేటి భారతీయులు సాధారణంగా అవలంబించే ‘అయితే, ఏమిటి?’ అనే తత్వానికి ప్రతిఫలంగా, విజయ దిశగా సవాళ్లను అధిగమించడానికి తాము ఎంచుకున్న దిశను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

“మ‌న‌మంతా క‌లిసి ఎదుగుదాం” అనేది కేవలం ప్రకటన మాత్రమే కాదు; తమ కస్టమర్ల కలలను సాకారం చేయడానికి, వారి సామర్థ్యాలను ఎదిగించడానికి సహకరించడంలో శ్రీరామ్ ఫైనాన్స్ శ్రద్ధను, భాగస్వామ్య దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.

“మా కస్టమర్లతో బలమైన సంబంధాలను నిర్మించడం ద్వారా, మేము వారికి ప్రేరణనిచ్చి, వారి ఆశయాలను నెరవేర్చేందుకు సహాయపడతాము” అనే సందేశాన్ని స్పష్టంగా ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది.

ఈ ప్రకటనకు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. టీమ్ వర్క్, స్థిరత్వం వంటి విలువలను ప్రతినిధి చేస్తూ శ్రీరామ్ ఫైనాన్స్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

ఈ ప్రచారానికి తెలుగులో గేయరచయిత కె.ఎస్. చంద్రబోస్, తమిళంలో మదన్ కార్కి సాహిత్యాన్ని అందించగా, హిందీ వెర్షన్‌కు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా వాయిస్ అందించారు.

“టుగెదర్, వి సోర్” అనే ఈ ప్రచారం సమగ్ర మీడియా వ్యూహంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయనుంది. ప్రింట్, డిజిటల్, టెలివిజన్, థియేటర్లతో పాటు ప్రొ కబడ్డీ లీగ్‌తో భాగస్వామ్యం ద్వారా కూడా ఈ ప్రకటనను ప్రేక్షకులకు చేరుస్తున్నారు.

ఈ ప్రకారంపై మాట్లాడిన శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలిజబెత్ వెంకటరామన్, “ఈ ప్రచారం ప్రతి భారతీయుడికి అండగా నిలవడమే లక్ష్యంగా రూపొందించారు. చిన్న వ్యాపారాల ఫైనాన్సింగ్ నుంచి బంగారం రుణాల వరకు వివిధ ఆర్థిక సేవల ద్వారా ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇస్తాం.

ఏడుగ భాషల్లో రూపొందించిన ప్రకటన దేశవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులను చేరుకోవడంలో మాకు సహాయపడుతోంది” అన్నారు.

ఈ ప్రచారంలో రాహుల్ ద్రావిడ్ వివిధ వర్గాల వ్యక్తులను శ్రీరామ్ ఫైనాన్స్ భాగస్వామ్యం ద్వారా తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలని ప్రోత్సహించడాన్ని చూపిస్తారు. వీడియో చివర్లో రూపకప్రాయమైన చిత్రాలు ఈ సందేశాన్ని మరింత బలంగా ప్రతిఫలింపజేస్తాయి.

error: Content is protected !!