365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 5,2023: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది దేవరకొండ బ్రాడ్‌కాస్ట్’ అనే పేరుతో సరికొత్త బ్రాడ్ కాస్ట్ ఛానెల్‌ను ప్రారంభించి, తన అభిమానులు, అనుచరులకు మరో అడుగు చేరువ అయ్యారు. ఈ ఛానెల్ ద్వారా, విజయ్ రాబోయే తన సినిమాల గురించి మరికొంత ప్రత్యేకమైన కంటెంట్‌ను అభిమానులతో పంచుకోనున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని సరికొత్త ఫీచర్‌లలో Broadcast Channels అనేవి ఒకటి కాగా, ఇది క్రమంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇది పబ్లిక్ ఫిగర్‌లు, క్రియేటర్‌ల కోసం వారి అభిమానులు, వారిని అనుసరించే వారిని అందరికీ ఆహ్వానించేందుకు, అత్యంత ఆసక్తిగల తమ అభిమానులతో ముఖాముఖి చర్చించేందుకు, ఒకరి నుంచి మరొకరు సందేశాలను వినిమయం చేసుకునుందుకు ఇది ఒక బహిరంగ సాధనం అని చెప్పవచ్చు.
వారు తమ తాజా అప్‌డేట్‌లు, తెరవెనుక క్షణాలను పంచుకునేందుకు టెక్ట్స్, ఫోటో, వీడియో మరియు వాయిస్ నోట్‌లను పంపించుకోవచ్చు. అలాగే, అభిమానుల అభిప్రాయాన్ని క్రౌడ్‌సోర్స్ చేసేందుకు పోల్స్‌ను కూడా సృష్టించవచ్చు.
తన ఛానెల్‌ళ్ల గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని ప్రారంభిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నా అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు, నా సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వాయిస్ నోట్స్, తెరవెనుక కంటెంట్‌ను పంచుకునేందుకు ఒక మార్గం. మీ అందరినీ అక్కడ చూడాలని నేను కోరుకుంటున్నాను!’’ అని తెలిపారు.

అభిమానులు ఆయన స్టోరీ స్టిక్కర్ లేదా ప్రొఫైల్‌కు పిన్ చేసిన లింక్ ద్వారా మొబైల్‌లో విజయ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కి లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఫాలోయర్‌గా ఉన్నవారికి ఛానెల్‌ని ప్రారంభించినప్పడు ఒక నోటిఫికేషన్ అందుతుంది.
‘‘జాయిన్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్’’ని నొక్కండి. ఛానెల్‌లో చేరిన తర్వాత, ఇది ఇతర సందేశ థ్రెడ్‌ల పక్కన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తుంది. అభిమానులు, ఫాలో అవుతున్నవారు కంటెంట్‌కు ప్రతిస్పందించి, పోల్‌లలో ఓటు వేయగలరు. కానీ సందేశాలను పంపలేరు. వారు విజయ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కు లింక్‌ను కూడా ఇతరులతో పంచుకోవడం ద్వారా స్నేహితులు అనుసరించేలా, వారితో చేరేలా చేయవచ్చు.