Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 11,2023: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ పసుపులేటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా బి.టెక్ పాస్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నామని చెప్పారు.

జూన్ 12న ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని శాంతినగర్ ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో పలు సంస్థల్లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా, జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పసుపులేటి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ ఈ వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకొని బయోడేటా ఫామ్ తో పాటు సంబంధిత విద్యార్హత జిరాక్స్ కాపీలతోపాటు ఆధార్, పాన్ కార్డ్, లేదా డ్రైవింగ్ లైసెన్స్ లను జతపరచి హాజరుకావాల్సిందిగా తెలిపారు. వెబ్సైట్లో నమోదు ప్రక్రియ గురించి అవగాహన లేని అభ్యర్థులు కూడా తమ సర్టిఫికేట్స్ తో హాజరు కావచ్చని శాంతినగర్ ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు వివరించారు. https://www.apprenticeshipindia.gov.in/

error: Content is protected !!