Sun. Dec 22nd, 2024
Indrakiladri_temple

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ, నవంబర్6,2022: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో ఈ నెల 7న విజయవాడలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు గిరి ప్రదక్షిణకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.

టోల్‌గేట్ సమీపంలోని ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, చిట్టానగర్, కొత్తపేట, నెహ్రుబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరుకుంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

Indrakiladri_temple

అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, కనకదుర్గానగర్, చినరాజగోపురం, పెద్ద రాజగోపురం ప్రాంగణాలను భక్తులు దీపాలు వెలిగించేందుకు జోన్‌లుగా విభజించారు. అదేవిధంగా సాయంత్రం 6.30 గంటలకు సంప్రదాయ జ్యోతి ప్రజ్వలన నిర్వహించన్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!