Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 28, 2023:టైయంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TYE )గ్రాండ్ ఫినాలే పోటీలు రేపు సాయంత్రం 5 గంటలకు, గచ్చిబౌలి లోని క్లబ్ బొటానికాలో జరుగనున్నాయి. TYE (TiE యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్) అనేది 9-12 తరగతుల నుంచి హైస్కూల్ విద్యార్థులు లేదా తత్సమాన కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించే పోటీ.

ఇందులో పాల్గొనే వారికి తరగతి గది సెషన్‌లు, మార్గదర్శకత్వం,వ్యాపార ప్రణాళిక చేసే విధానం వంటి వాటిపై శిక్షణ ఇచ్చి, పోటీలకు సమాయత్త పరిచే పోటీలనుTiE గ్లోబల్ ఇన్షియేటివ్ కార్యక్రమం. ఈ ఏడాది టై హైదరాబాద్14మంది విద్యార్థులను ఎంపిక చేసి 4 టీమ్‌లుగా ఏర్పాటు చేసింది. ఈ యువ ఆవిష్కర్తలు నవంబర్, డిసెంబర్ – 2022 జనవరి- 2023లో విజయవంతమైన TiE హైదరాబాద్ వ్యాపారవేత్తల నేతృత్వంలో బూట్ క్యాంప్‌లు,వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు.

ఈ 4 టీమ్‌లు TiE హైదరాబాద్ చార్టర్ సభ్యులు సలహాదారులుగా వ్యవహరించి పోటీకి తీర్చిదిద్దారు. ఈ యువ వ్యవస్థాపకులను వ్యవస్థాపకతకు సంబంధించిన అన్ని అంశాలలో తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి వ్యాపార ప్రణాళిక లేదా ఆవిష్కరించబోయే ప్రొటో టైపు ఉత్పత్తిని వ్యాపార ప్రణాళికను జ్యూరీ సభ్యులకు వివరించనున్నారు. ఈ పోటీలో విజేతలనుTYE గ్లోబల్ పోటీకి నామినేట్ చేస్తారు.

TYE అనేది హైస్కూల్ విద్యార్థులకు వ్యవస్థాపకత, నాయకత్వ నైపుణ్యాలను నేర్పడానికి రూపొందించబడింది. TYE ప్రోగ్రామ్ 16-వారాల వ్యవధి ఉంటుంది. ఇందులో డిజైన్ థింకింగ్ వర్క్‌షాప్‌లు ,వ్యాపార ప్రణాళిక అభివృద్ధికి మార్గదర్శక మద్దతు, వ్యాపార ప్రణాళిక పోటీతో ముగుస్తుంది.

TiE హైదరాబాద్: TiE (ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్) అనేది 14+ దేశాల్లోని 61+ నగరాల్లో 15000+ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో కూడిన నెట్‌వర్క్, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన, అత్యంత అవార్డు పొందిన ప్రాంతీయ శాఖ, ప్రతి సంవత్సరం TiE హైదరాబాద్ 1100 ప్రారంభ దశలో ఉన్న అంకుర సంస్థలపైనా 6400+ విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.

20+ థీమ్‌ల కింద అనేక కార్యకలాపాలను నిర్వహిస్తారు.TiE Grad, TiE యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఓపెన్ మైక్, మెంటర్ అడ్వైజర్, ఇన్వెస్టర్ కనెక్ట్, గురువారం రాత్రి చర్చలు, లీడర్‌షిప్ సిరీస్ మొదలైనవి తదుపరి తరం వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వంశీకృష్ణ జె, అసోసియేట్ డైరెక్టర్, 7799439281ని సంప్రదించండి లేదా hyderabad.tie.orgని సందర్శించండి.

error: Content is protected !!