365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 2,2025: మలయాళ హీరో టొవినో థామస్ నటించిన కాప్ యాక్షన్ డ్రామా ‘నరివెట్ట’ మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో టొవినో నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. మలయాళంలో బలమైన ఫాలోయింగ్ ఉన్న టొవినో, తెలుగులోనూ గుర్తింపు పొందారు.

ఇది కూడా చదవండి…నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 లక్ష్యాలను సాధించేలా యూనివర్సిటీలకు చేయూతనిస్తున్న NIAT

‘నరివెట్ట’ చిత్రంలో టొవినో పోషించిన పోలీస్ పాత్రలోని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కి కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ గా స్పందిస్తున్నారని టొవినో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది.

‘నరివెట్ట’ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా, అబిన్ జోసెఫ్ నిర్మించారు. ఇందులో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి…దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం: ఈశాన్య, ఢిల్లీలో వాతావరణం..

ఇటీవల ‘ఐడెంటిటీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న టొవినో, ఇప్పుడు ఈ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలవబోతున్నాడు.