365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 2024:మలయాళ నటుడు టోవినో థామస్ తన తదుపరి చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి “అజయంతే రాండమ్ మోషణం” (ARM) అనే ఆసక్తికరమైన పేరు పెట్టారు.
ఇటీవల ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
పొడవాటి జుట్టుతో టోవినో థామస్ కఠినమైన పాత్రలో కనిపించడం అభిమానులను సంతోషించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ,కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇటీవల, ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP కొనుగోలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి వారు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి సంగీతం అందించిన దిభు నినాన్ థామస్, సినిమాటోగ్రఫీని జోమోన్ టి జాన్ నిర్వహిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్,UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ ,లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, కథను సుజిత్ నంబియార్ అందించారు.
తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఇటీవల, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు, ఇది సినిమా ప్రేక్షకుల నుంచి “విజువల్ వండర్” అని ప్రశంసలు పొందుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.