365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు,19 మే, 2025: టొయోటా కిర్లోస్కర్ మోటర్ వేసవి సెలవులకు ప్రత్యేకంగా ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రకటించింది. ఈ మోస్తరు వేడిలో వినియోగదారులకు మరింత విలువను అందించాలనే లక్ష్యంతో మే ,జూన్ నెలల్లో దక్షిణ భారతదేశంలోని అన్ని అధీకృత టొయోటా డీలర్‌షిప్‌లలో ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి…ఇసుజు మోటార్స్ ఇండియా తిరుపతిలో కొత్త 3S ఫెసిలిటీ ప్రారంభం

Read This also…Muthoot FinCorp Launches New SRK Gold Loan Campaign..

ఈ ప్రచారంలో భాగంగా కొత్త కార్లు కొనుగోలు చేయడం, వాహనాలకు సర్వీసింగ్ చేయించుకోవడం, ధృవీకృత యూజ్డ్ కార్లను పొందడం, అలాగే వాహన ఉపకరణాల అప్‌గ్రేడ్ లాంటి సేవలు ప్రత్యేక డీల్స్‌తో లభించనున్నాయి.

ఈ సందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్స్ (దక్షిణ రీజియన్) చీఫ్ రిప్రజెంటేటి,వైస్ ప్రెసిడెంట్ వైస్‌లైన్ సిగామణి మాట్లాడుతూ, “మా వినియోగదారులకు ప్రతి టచ్‌పాయింట్‌లో ఉత్తమమైన అనుభవాన్ని అందించడమే మా కృత నిబద్ధత.

ఈ ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’తో, మేము టొయోటా యాజమాన్యంలో మరింత విలువను కలిపించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నాం. అంతేకాకుండా, ఈ వేడుకలో భాగంగా ఉచిత కార్ హెల్త్ చెకప్ సర్వీసును కూడా అందిస్తున్నాం,” అని తెలిపారు.

Read This also…Trump Ally Laura Loomer Claims Biden’s Health in Rapid Decline..

Read This also…YouTuber Held for Espionage Over Pakistan Links..

ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని టొయోటా డీలర్‌షిప్‌లలో అమలులో ఉంది.