365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,అక్టోబర్ 4,2024: భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) స్పామ్ సందేశాలను ఎదుర్కోవడానికి కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఇది Jio, Airtel, Vodafone Idea వంటి ప్రధాన టెలికాం వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది.
స్పామ్ సందేశాల నియంత్రణలో కొత్త నిబంధనలు
స్పామ్ సందేశాలు, వ్యాపార లింక్‌లు, యాప్‌ల లింక్‌లు, ఫైల్ అటాచ్‌మెంట్‌లను పంపిణీ చేసేందుకు కంపెనీలు ముందుగా టెలికాం ప్రొవైడర్లకు సమాచారం ఇవ్వాలని TRAI ఆదేశించింది. ధృవీకరించని సందేశాలు బ్లాక్ చేశాయి, ధృవీకరించిన సందేశాలు మాత్రమే వినియోగదారులకు పంపబడతాయి.
వైట్‌లిస్టింగ్ ద్వారా రక్షణ
TRAI కొత్త నిబంధనల ప్రకారం, “వైట్‌లిస్టింగ్” ప్రక్రియ ద్వారా అన్ని వాణిజ్య సందేశాలు ధృవీకరించాలి. ఈ ప్రక్రియ వినియోగదారులను స్కామ్‌లు, ఫిషింగ్ దాడుల నుంచి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. నకిలీ, ధృవీకరించని సందేశాల బ్లాకింగ్‌తో వినియోగదారుల సమాచార భద్రత పెరుగుతుంది.
స్పామ్ సందేశాల ఉధృతి
దేశంలో ప్రతిరోజూ సుమారు 170 కోట్ల స్పామ్ సందేశాలు వినియోగదారులకు చేరుతున్నాయి, ఇవి వారి గోప్యతకు, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయి. TRAI తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం, వాణిజ్య సందేశాలు, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు, ప్రమోషనల్ ఆఫర్‌లు, ఖాతా అప్‌డేట్‌లు వైట్‌లిస్ట్ చేయబడాల్సి ఉంది.
వినియోగదారులకు సౌలభ్యం
TRAI పరిష్కారాలతో Jio, Airtel, Vodafone Idea వినియోగదారులు ఇకపై స్పామ్ కాల్స్, సందేశాల్లో గణనీయమైన తగ్గింపును అనుభవిస్తారు. అన్ని సందేశాలు సురక్షిత ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే పంపబడటం వినియోగదారుల భద్రతను కలిపిస్తుంది.